ఏపీ అల్లర్లపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీలో పోలింగ్( AP Polling ) అనంతరం భారీ ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే.

గతంలో ఎన్నడు లేని విధంగా పలు పార్టీల కిందిస్థాయి క్యాడర్ ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం జరిగింది.

పల్నాడులో( Palnadu ) బాంబులు కూడా విసురుకున్నారు.తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడి చేశారు.

ఈ క్రమంలో ఏపీలో అల్లర్లపై మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందడం వల్లే.

రెండు శాతం పోలింగ్ పెరిగిందని.ఇది వైసీపీకి అనుకూలమని అన్నారు.

"""/" / జూన్ 9వ తేదీన ముఖ్యమంత్రిగా రెండోసారి వైఎస్ జగన్( YS Jagan ) ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని వెల్లడించారు.

వాలంటీర్ వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని ఇతర రాష్ట్రాల సైతం ఈ వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలను( Welfare Schemes ) పారదర్శకంగా అవినీతికి చోటు లేకుండా మధ్యవర్తిత్వం లేకుండా అందించామని స్పష్టం చేశారు.

జగన్ ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తే చంద్రబాబు అడ్డుకునేందుకు ప్రయత్నించారని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో ఏపీలో అల్లర్లపై స్పందించారు.పోలింగ్ తర్వాత నాయకులు చాలామంది రిలాక్స్ అవుతున్నారు.

వారంతా విశ్రాంతి తీసుకుంటే ద్వితీయ, తృతీయ శ్రేణులు నాయకులు ఎందుకు గొడవ పడుతున్నారు.

మీరంతా సంయమనం పాటించండి.గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదని అన్నారు.

దేశానికి ఏం సేవ చేశాడు : నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్ నివాళిపై భారత సంతతి ఎంపీ అసంతృప్తి