ప్రజలకు ఆశలు కల్పించి చంద్రబాబు పబ్బం గడుపుకుంటారు.. మంత్రి బొత్స సత్యనారాయణ
TeluguStop.com
అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.ప్రజలకు ఆశలు కల్పించి చంద్రబాబు పబ్బం గడుపుకుంటారు.
ఎక్కడా అవినీతి లేకుండా ప్రభుత్వం నేరుగా లబ్దిదారులకు బ్యాంకులకు నగదు బదిలీ చేస్తున్నాం.
పెట్రోల్ డీజిల్, బొగ్గుపై పెంచుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానం వల్లే ప్రజలు కష్టాలు పడుతున్నారు.కేంద్ర విధానాల వల్ల బొగ్గు కొరతతో కరెంటు కష్టాలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఎపీలోనే కాదు దేశవ్యాప్తంగా కేంద్రం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ముందస్తు ఎన్నికలు మాకు అవసరం లేదు.
చంద్రబాబే కావాలనుకుంటున్నారు.గడప గడపలో మమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు .
? ఎవరూ అడ్డుకోవడం లేదు.తమ ఉనికి చాటుకునేందుకే వామపక్షాలు ఆందోళనకు పిలుపునిచ్చారు.
విద్యుత్ ఉత్పత్తి ధరలు పెరగడం వల్లే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరుగుతున్నాయి.ఇతర రాష్ట్రాల్లో కంటే రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కువగా లేవు.
ఎపీ కంటే ఎక్కువగా పలు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉంటే దాన్ని మీడియా నిరూపించాలి.
మళ్లీ సీఎం జగన్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.చంద్రబాబు అప్పులు చేయకుండా ఆయన ఆస్తులు అమ్మి డబ్బు తెచ్చారా.
? కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయడం లేదా.ఇతర రాష్ట్రాలు అప్పులు చేయడం లేదా.
రాజ్యాంగ బద్దంగా నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెస్తుంది.తిరిగి అప్పులు చెల్లిస్తుంది.
శ్రీలంకకు పటిష్ట నాయకత్వం లేకపోవడం వల్ల అలాంటి పరిస్థితి వచ్చింది.ఎపీలో శ్రీలంక తరహా పరిస్థితులు లేవు.
ఇక్కడ పటిష్ట నాయకత్వం ఉంది.
అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక మందన్న… తగ్గేదేలే అంటున్న శ్రీవల్లి!