సీపీఎస్ కంటే మెరుగైన స్కీం తేవాలని జీపీఎస్ తెచ్చాం - మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్.సీపీఎస్ కంటే మెరుగైన స్కీం తేవాలని జీపీఎస్ తెచ్చాం.

జీపీఎస్ స్కీంలోనూ మరిన్ని సదుపాయాలు పెంచుతున్నట్లు చెప్పాం.ఉద్యోగి రిటైర్ అయ్యాక గ్యారెంటీగా పెన్షన్ గా మినిమం పదివేలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నాం.

ఉద్యోగి, వారి సతీమణికి ప్రమాద బీమా, హెల్త్ కార్డు సదుపాయాలు కల్పిస్తామని చెప్పాం.

ఉద్యోగి చనిపోయినా వారి స్పౌజ్ కు పెన్షన్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పాం.జీపీఎస్ ను అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.

ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చిస్తాం.సవరించిన జీపీఎస్ స్కీంపై సీఎం తో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తాం.

జీపీఎస్ కు చట్టబద్దత కల్పిస్తాం.దీనిపై శాసన సభలో చట్టాన్ని చేస్తాం.

సీపీఎస్ రద్దు చేసి ఒపీఎస్ ను పునరుద్దరించడం సాధ్యడదని సమావేశంలో ఖరాఖండిగా చెప్పాం.

సీపీఎస్ రద్దుపై మేం తొందరపడి హామీ ఇచ్చాం.మేనిఫెస్టోలో 95 శాతం హామీలే మేము నెరవేర్చామని చెప్పాం.

నెరవేర్చని 5శాతం హామీల్లో సీపీఎస్ రద్దు కూడా ఉందని చెప్పాం.ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తే మేము ఏం చేస్తాం.

కేసుల ఎత్తివేయాలని ఉద్యోగులు కోరారు.తీవ్రమైన కేసులు పెట్టిన వాటిపై రేపు సీఎం కు ఈ అంశాన్ని తీసుకుపోతాం.

ఉద్యోగులపై పెట్టిన కఠిన కేసుల ఎత్తివేతపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పాం.

తేజ సజ్జ పరిస్థితి ఏంటి..? పాన్ ఇండియాలో సక్సెస్ ల పరం పర కొనసాగుతుందా..?