ఉపాధ్యాయ సంఘాల నేత‌ల‌తో మంత్రి బొత్స భేటీ

ఏపీలో ఉపాధ్యాయ సంఘాల నేత‌ల‌తో మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ భేటీ అయ్యారు.ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా ఫేస్ రిక‌గ్నిష‌న్ యాప్ స‌హా ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.

యాప్ లో నెల‌కొన్న సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రిస్తామ‌ని మంత్రి బొత్స తెలిపారు.

ఏ స‌మ‌స్య ఉన్నా త‌మ దృష్టికి తీసుకువ‌స్తే ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పారు.అదేవిధంగా టీచ‌ర్ల‌పై పెట్టిన కేసుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామ‌ని వెల్ల‌డించారు.

రాష్ట్ర‌వ్యాప్తంగా 86 శాతం మంది టీచ‌ర్స్ యాప్ లో హాజ‌రు న‌మోదు చేశార‌ని మంత్రి బొత్స అన్నారు.

స‌ర్వీస్ రూల్స్ లో ఉన్న అంశాల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు.ఉపాధ్యాయుల‌తో పాటు విద్యార్థుల‌కు మంచి చేయాల‌నేదే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు.

అదేవిధంగా సీపీఎస్ అంశంపై మూడు రోజుల్లో ఉద్యోగుల‌తో చ‌ర్చిస్తామ‌ని తెలిపారు.

బాలయ్యతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్న పూరీ.. నటసింహం ఛాన్స్ ఇస్తారా?