ప్రశాంత్ కిషోర్ కు మంత్రి బొత్స కౌంటర్..!!

ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కు వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ( YCP Minister Botsa Satyanarayana ) కౌంటర్ ఇచ్చారు.

ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu ) కోసం మాట్లాడుతున్నారని తెలిపారు.

ప్యాకేజీ తీసుకుని ఆయన మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.ప్రశాంత్ కిషోర్ రివర్స్ లో తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పారు.

నాయకుడికి, ప్రొవైడర్ కు ఉన్న తేడా కూడా పీకేకు తెలియడం లేదా అని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే జనంలో నుండి వచ్చిన నేత సీఎం జగన్( CM YS Jagan ) అని తెలిపారు.

మంచి జరిగితేనే ఓటు వేయాలంటున్న జగన్ నాయకుడా? జగన్ ను విమర్శిస్తూ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో దిగే చంద్రబాబు నాయకుడా ? అన్నది చెప్పాలన్నారు.

గత ఎన్నికల్లో జగన్ తరపున పని చేసిన ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) తన మాటలను ఓ సారి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు.

యంగ్ డైరెక్టర్స్ తో చిరంజీవి సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే..?