విశాఖ రాజధానికి అడ్డంకులు ఉన్నాయంటూ మంత్రి బొత్స వ్యాఖ్యలు

విశాఖ పరిపాలన రాజధానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

అయినా ఆ అడ్డంకులన్నీ పరిష్కరించుకొని త్వరలోనే రాజధాని రాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష ఇక సాకారం అయినట్లేనని తెలిపారు.అనంతరం టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అమరావతి రైతుల పాదయాత్ర టీడీపీ ముసుగులో జరుగుతుందని ఆరోపించారు.ఈ పాదయాత్రను టీడీపీనే నడిపిస్తోందని ప్రజలు తెలిసిపోయిందని చెప్పారు.

అందుకే రైతులు పాదయాత్రను విరమించుకున్నారని ఆయన వ్యాఖ్యనించారు.

ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీకి ఆ టైటిల్ ను ఫిక్స్ చేయడం కష్టమే.. ఆ కష్టాన్ని అధిగమిస్తారా?