విశాఖలో 25 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేశారు :అయ్యనపాత్రుడు
TeluguStop.com
విశాఖ పార్టీ కార్యాలయంలో విలేఖలు సమావేశంలో పోలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యనపాత్రుడు మాట్లాడుతూ విశాఖలో 25 వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేశారు.
రాజశేఖరరెడ్డి ఇచ్చిన స్ధలాలను కూడా ఆక్రమించేశారు.భారతి ఫోన్ ఎత్త లేదని విశాఖ కమిషనర్ ను బదిలీ చేయడం అన్యాయం కాదా.
ఉత్తరాంధ్ర ప్రేమ కురుపిస్తోన్న వైసిపి నాయకులు ఎవరైనా భూదందాలపై జగన్ దృష్టికి తెచ్చారా.
అమర్ హూందాగా మాట్లాడాలి.దెయ్యాలు పాదయాత్ర చేస్తున్నాయంటారా.
జాబ్ క్యాంలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు.వారు తిరగబడతారు.
ఏపిలో 16 మెడికల్ కాలేజీలను ఆన్ లైన్ లో శంకుస్ధాపన చేశారు.అనకాపల్లి లో సాయికుమార్ తో ఆర్టీఐ లో ధరకాస్తుచేశారు.
సెప్టెంబరు6 న రిప్లై వచ్చింది.16 కాలేజీలకు కేంద్రం వద్ద ప్రపోజల్సే లేవట.
కేవలం ఏడింటికే ప్రపోజల్స్ వెళ్లాయి..
వాటిలో మూడింటీకే అనుమతులు వచ్చాయి.కానీ వైద్యశాఖ మంత్రి విడదల రజని అసెంబ్లీలో అబద్దాలు చెపుతున్నారు.
పాడేరు మెడికల్ కాలేజి నిర్మాణానికి కాంట్రాక్టర్ కు డబ్బులు ఇవ్వకపోవడంతోవనులు ఆగిపోయాయి.
నర్సీపట్నం మెడికల్ కాలేజీ లిస్ట్ లోనే లేదు.సేంక్షన్ లేకుండా భూములు ఎలా సేకరించారు.
మెడికల్ కాలేజ్ రానపుడు ఎవరి భూములు వారికి ఇవ్వాలికదా.అసెంబ్లీ లో కేవలం పొగడ్తలకు సమయం సరిపోతుంది.
రాజధానికోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు వాళ్లు.చేతనైతే వారికి సాయం చేయండి.
లేదంటే ఊరుకోండి.డబ్బుపై ఆశ చావక భారతి ని లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యేలా చేశావు.
దీనికి చంద్రబాబుతో సంబంధం ఏంటి.అమరావతి భూములు దోచుకున్నామని మాపై నిందలు వేస్తున్నారు.
దీనిపై ఎంక్వైరీ వేసుకోండి.అలాగే విశాఖలో మీరు దోచుకున్న భూములపై కూడా ఎంక్వైరీ వేయాలి.
నిర్మాణంలో వున్న బిల్డింగ్ ముందు ప్లాన్ ప్రర్శించాలి.రుషికొండ తవ్వుతున్నారు అక్కడ ఏమి కడుతున్నారో చెప్పరా.
కలెక్టర్ కమిషనర్లకే తమకు తెలీదని చెప్పడం ఆశ్చర్యంగా వుంది.రైతులపక్షాన న్యాయం వుంది వారికి సుప్రీంకోర్టు కు వెళ్లినా వారే నెగ్గుతారనే విశ్వాసం నాకు వుంది.
భూ కుంభకోణాలపై రెండు సిట్ లనూ ఓపెన్ చేసే అధికారం కేంద్రానికి వుంది.
అధికారం వారిచేతిలోనే వుంది కదా.విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి అంటే గ్రాఫిక్స్ అన్నారు.
విశాఖ ను పరిపాలన రాజధాని పెరు చెప్పి బూటకపు మాటలు ఇక్కడ ఆస్తులు తనఖా పెట్టారు.
విశాఖను పరిపాలన రాజధాని అంటారుకర్నూల్ న్యాయరాజధాని అంటారు.విశాఖ లో ఒక్క నిర్మాణాం చేశారా.
విశాఖకు పదివేల కోట్లు వెచ్చిస్తే చాలు అద్భుతమైన నగరం అవుతుందని చెప్పారు.విశాఖ లో భూములు25 వెల కోట్లు ఆస్తులు అమ్మకానికి గేజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు.
పాలిటెక్నిక్ కాలేజ్, సర్క్యూట్ హౌస్, ప్రభుత్వ భూములు తనఖా పెట్టారు.డీఈవో ఆఫీస్, గ్రంధాలయం, రేసపువానిపాలెం ఎమ్మార్వో ఆఫీస్ , రైతుబజార్లు తనఖా పెట్టారు.
మొత్తం 150 ఎకరాలు భూములు,25 వేల కోట్లు తనఖా పెట్టారు.మూడు రాజధానులు వల్ల ఖర్చు అవుతోందని లెక్కలు చెప్పుతున్నాయి.
రుషి కొండ అంటే సప్త ఋషులు తిరిగిన నెల.అక్కడ సీఎం ఆఫీస్ కడతాను అంటారు.
అందుకోసం కొండను పిండి చేస్తారా.
ఆ సినిమాకు మహేష్ బాబు జీరో రెమ్యునరేషన్.. రూట్ మార్చి మంచి పని చేశారా?