చంద్రబాబుపై మంత్రి అప్పలరాజు సీరియస్ వ్యాఖ్యలు..!!

వైసీపీ మంత్రి అప్పలరాజు టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

గత కొన్ని సంవత్సరాల నుండి కుప్పం నియోజకవర్గంలో దొంగ ఓట్లతో చంద్రబాబు గెలుస్తున్నారని ఆరోపించారు.

కుప్పంలో 30 నుండి 40 వేల బోగస్ ఓట్లు ఉన్నాయని అన్నారు.వాటిని తొలగిస్తున్న క్రమంలో చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

ఢిల్లీలో బీజేపీ నాయకులు చాలాసార్లు అపాయింట్మెంట్ ఇవ్వని క్రమంలో ఎన్టీఆర్ వందో నాణెం కార్యక్రమం పెట్టి బీజేపీ నేతలతో లాబీయింగ్ చేశారని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికలలో ఎన్టీఆర్ బొమ్మతో ఓట్లు పొందాలని బాబు తాపత్రయపడుతున్నట్లు మంత్రి అప్పలరాజు( Minister Appalaraju ) విమర్శించారు.

ఢిల్లీ వేదికగా ఎన్టీఆర్( NTR ) కి భారతరత్న ఎందుకు అడగలేదు అని విమర్శించారు.

ఎన్టీఆర్ కి ప్రత్యేక గుర్తింపు రావాలని చంద్రబాబుకు లేదని చెప్పుకొచ్చారు.ఎన్టీఆర్ గౌరవం తగ్గించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో విశాఖలో మత్స్యకారుల సమస్య 30 ఏళ్ళ క్రితంది అని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.

దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు.ఈ క్రమంలో మత్స్యకారులతో చర్చించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.

విశాఖ మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ తో కూడా మాట్లాడినట్లు మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు.

బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి: మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి…