జనసేనాని పొత్తు ధర్మం వ్యాఖ్యలపై మంత్రి అంబటి కౌంటర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )పొత్తు ధర్మం వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.

పొత్తు ధర్మమే కాదు.ఏ ధర్మం పాటించని వ్యక్తి చంద్రబాబు( Chandrababu ) అని విమర్శించారు.

"""/" / ఇకనైనా తెలుసుకో తమ్ముడు పవన్ అంటూ మంత్రి అంబటి( Ambati Rambabu ) ట్విట్టర్ వేదికగా సూచించారు.

అయితే రా కదలి రా కార్యక్రమంలో భాగంగా మండపేట టీడీపీ అభ్యర్థిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీనిపై పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు.పొత్తు ధర్మాన్ని టీడీపీ విస్మరించిందన్న ఆయన చంద్రబాబు తరహాలోనే తనపై కూడా ఒత్తిడి ఉందని తెలిపారు.

ఈ క్రమంలోనే తాను కూడా అభ్యర్థులను ప్రకటిస్తున్నానన్న పవన్ కల్యాణ్ రాజోలు, రాజానగరం జనసేన అభ్యర్థుల పేర్లను వెల్లడించిన సంగతి తెలిసిందే.

ముగ్గు చల్లుతూ ఇంత అందమైన రంగోలి వేయగలరా.. ఈ వీడియో చూస్తే నమ్మలేరు!