ఏపీ రైతులకు మంత్రి అంబటి రాంబాబు కీలక సూచన

ఏపీ రైతులకు మంత్రి అంబటి రాంబాబు కీలక సూచనలు చేశారు.నాగార్జునసాగర్, పులిచింతల, శ్రీశైలం ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు లేవని పేర్కొన్నారు.

ఈ క్రమంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై ఆధారపడిన రైతులు వరినాట్లు వేయవద్దని సూచించారు.ఆగస్ట్ నెలలో వర్షాలు సరిగా లేని కారణంగా సకాలంలో నాట్లు వేసే పరిస్థితి లేదని మంత్రి అంబటి తెలిపారు.

ఈ నేపథ్యంలో వరికి బదులుగా ఆరుతడి పంటలు, మెట్ట పైరులు వేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని వెల్లడించారు.

రిషబ్ శెట్టి కాంతార2 మూవీకి మరో భారీ షాక్ తగిలిందా.. అసలేం జరిగిందంటే?