Minister Ambati Rambabu : ఏపీలో వాలంటీర్లపై ఈసీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటున్న మంత్రి అంబటి రాంబాబు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయవద్దని కేంద్రా ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలలో పేర్కొంది.

కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం పై మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాలంటీర్లపై ఈసీ తీసుకున్న నిర్ణయం బాధాకరమని పేర్కొన్నారు.ఈ నిర్ణయంపై ఈసీ పునరాలోచన చేయాలని కోరారు.

ఈసీ నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడతారు. """/" / చంద్రబాబు, పవన్( Chandrababu, Pawan ) వాలంటీర్ల సేవలను ప్రశంసించాల్సింది పోయి అడ్డుకుంటున్నారు.

జగన్ పై కక్షతో వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.వారి కుట్రలతో వాలంటీర్లను బలి చేయాలనుకుంటున్నారు అని మంత్రి అంబటి మండిపడ్డారు.

చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్( Nimmagadda Ramesh ) ద్వారా ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయించారు.

ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా.తన నిర్ణయాన్ని పునారాలోచించుకోవాలి.

పెన్షన్లు తీసుకునే వారిపై కక్షతోనే చంద్రబాబు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు.ఇక్కడ బలవుతోంది వాలంటీర్లే కాదు.

అవ్వ తాతలు, దివ్యాంగులు.సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులు.

అని మంత్రి అంబటి ఆవేదన వ్యక్తం చేశారు.

వేలు పెట్టకుండా ఉంటే దేవర లాంటి ఫలితాలే వస్తాయి… ప్రముఖ రచయిత షాకింగ్ కామెంట్స్!