Ambati Rambabu : ఎంపీ లావు కృష్ణదేవరాయలు పై మంత్రి అంబటి రాంబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

ఇటీవల నరసారావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు( Sri Krishna Devarayalu Lavu ) వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేయడం తెలిసిందే.

అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలతో వరుసగా సమావేశం అవుతున్నారు.గతవారం చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టిన సమయంలో ఆయనతో సమావేశమయ్యారు.

అయితే ఇప్పటివరకు లావు కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కాలేదు.అయినా గానీ.

నిత్యం వారితో సమావేశాలు కావడం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.ఆఖరికి మంగళవారం రాత్రి పల్నాడు జిల్లాలో డాక్టర్ మర్రి పెద్దయ్య హాస్పిటల్ నందు సామాజిక వర్గ డాక్టర్స్ తో పరిచయ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

"""/" / పరిస్థితి ఇలా ఉంటే లావు కృష్ణదేవరాయలు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu )సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

బీసీల కోసం సీటు వదులుకోమంటే పార్టీనే వదిలిన విశ్వాసఘాతకుడు.లావు కృష్ణదేవరాయలు అని మండిపడ్డారు.

అలాంటి ద్రోహులకు బీసీల ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు.'జలవనరుల శాఖను వదిలిపెట్టమని సీఎం జగన్( CM Jagan) చెప్పగానే వదిలేసిన విశ్వాసపాత్రుడు అనిల్ కుమార్.

నరసరావుపేటకు సింహపురి నుంచి కొత్త ఉత్సాహం వచ్చింది.ఈ క్రమంలో అనిల్ నీ భారీ మెజార్టీతో గెలిపించాలి' అని కార్యకర్తలకు అంబటి పిలుపునిచ్చారు.

2019 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రారంభంలో మంత్రి పదవి అందుకున్న అనిల్ తర్వాత.

పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవి కోల్పోయారు.కాగా ఇప్పుడు 2024 ఎన్నికలలో నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయబోతున్నారు.

3 గంటల్లోనే రూ.4 లక్షలు సంపాదించిన యువతి.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..