అన్ స్టాపబుల్ షోలో చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి అంబాటి రాంబాబు సెటైర్ లు..!!
TeluguStop.com
ఆహాలో అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ నేడు స్ట్రీమింగ్ అవుతూ ఉంది.
బాలకృష్ణ హోస్ట్ గా ఈ టాకీ షోలో చంద్రబాబు మరియు నారా లోకేష్ రావటం జరిగింది.
ఒకరు అల్లుడు మరొకరు బావగారు కావటంతో బాలకృష్ణ తనదైన శైలిలో ప్రశ్నలు వేసి ఎంటర్టైన్మెంట్ తో పాటు కీలక సమాధానాలు రాబట్టారు.
వ్యక్తిగతంగా ఇంకా పొలిటికల్ గా కుటుంబపరంగా అనేక ప్రశ్నలు వేయడం జరిగింది.దీనిలో భాగంగా 1995 సంఘటన గురించి బాలకృష్ణ వేసిన ప్రశ్నకు చంద్రబాబు ఇచ్చిన జవాబుపై వైసీపీ మంత్రి అంబాటి రాంబాబు సెటైర్లు వేశారు.
కాళ్లు పట్టుకొని అడుక్కున్నాడు, తన మాట వినమని! వినల! గొంతు పిసికి చంపేశాడు!! అతని విలన్ అంటారా.
? హీరో అంటారా.? అంటూ అంబాటి రాంబాబు తన ట్విట్టర్ లో ప్రశ్నించారు.
అంతేకాదు నాటి వెన్నుపోటును కప్పిపుచ్చుకునేందుకే అన్ స్టాపబుల్ షోకి చంద్రబాబు వచ్చారని ఆరోపణ చేశారు.
సూపర్ హీరో పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ.. ఈ హీరో ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!