అంబటి రాయుడుపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్..!!
TeluguStop.com
ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు( Cricketer Ambati Rayudu ) రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం వైసీపీ పార్టీ అధినేత సీఎం జగన్ సమక్షంలో వైసీపీ( YCP )లో జాయిన్ అయ్యారు.
అయితే వారం రోజులు గడవక ముందే వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు.తన రాజీనామకి కారణం దుబాయిలో టి20 టోర్నమెంట్ ఉందని అందువల్ల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే విదేశాలలో క్రికెట్ టోర్నమెంట్( Cricket Tournament ) కారణంగా రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించి నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు భేటీ అయ్యారు.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో భేటీ అనంతరం ట్విట్టర్ లో "నా ఐడియాలజీ వైసీపీ ఐడియాలజీ పూర్తి భిన్నంగా ఉన్నాయి.
అందువల్లే ఆ పార్టీకి దూరమయ్యా.ఇక ఇదే సమయంలో.
నా ఐడియాలజీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐడియాలజీకి దగ్గరగా ఉంది.రాజకీయాలు వదిలేద్దాం అనుకున్న.
కానీ సన్నిహితుల సూచన మేరకు పవన్ అన్నను కలిశా.త్వరలో క్రికెట్ టోర్నీ కోసం దుబాయ్ వెళుతున్న అని అంబటి రాయుడు ట్వీట్ చేశారు.
ఈ క్రమంలో అంబటి రాయుడు పై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) ట్విట్టర్ లో సెటైర్ వేశారు.
"ప్రస్తుతం ఈ టీంలో ఆడుతున్నాడు" అంటూ ట్వీట్ చేశారు.
కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్ధుల హత్య .. రంగంలోకి విదేశాంగ శాఖ