ఆత్మకూరు ఉప ఎన్నికల కోసం అందరూ కలిసి కృషి చేయాలి మంత్రి అంబటి రాంబాబు
TeluguStop.com
బిల్లులు రాకపోవడంతో వైసిపి నాయకులు,కార్యకర్తలు అసంపూర్తిగా ఉన్న మాట వాస్తవమే కానీ ఆత్మకూరు ఉప ఎన్నికల కోసం అందరూ కలిసి కృషి చేయాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామం లో వైసీపీ కార్యకర్తలతో మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున పాల్గొన్నారు.
ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీలో ఉండి ఉంటే బిజెపి కంటికి కూడా కనబడేది కాదని అంబటి విమర్శించారు.
వాళ్ళ గుర్తింపు కోసమే వైసిపి పైన బిజెపి వాళ్ళు విమర్శలు చేస్తున్నారాన్న అంబటి కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నా, దేశంలో బిజెపి అతిపెద్ద పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పార్టీ తుస్సే.
నని ఎద్దేవా చేశారు.లక్ష ఓట్ల మెజారిటీతో మేకపాటి గౌతమ్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
ఆ ఒక్క విషయంలో మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ ను రిక్వెస్ట్ చేసిన బన్నీ.. ఏం జరిగిందంటే?