జనసేన వీర మహిళలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్..!!
TeluguStop.com
ఈనెల 15వ తారీకు మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ వైజాగ్ లో "విశాఖ గర్జన" అతిపెద్ద ర్యాలీ నిర్వహించడానికి రెడీ కావడం తెలిసిందే.
"విశాఖ గర్జన" పేరట జరగబోయే కార్యక్రమం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ట్విట్టర్ లో సెటైరికల్ గా మండిపడుతున్నారు.
ప్రజా సమస్యల లేవనెత్తుతూ "విశాఖ గర్జన" కార్యక్రమం పై పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా విమర్శలు చేస్తూ ఉన్నారు.
"""/"/
మరోపక్క జనసేన పార్టీకి చెందిన వీర మహిళలు కూడా వైసీపీ "విశాఖ గర్జన" పై సెటైర్లు వేస్తున్నారు.
దమ్ముంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరుతున్నారు.ఇంకా ఇదే సమయంలో వైసీపీ మంత్రులు కూడా ఘాటుగానే కౌంటర్లు వేస్తూ ఉన్నారు.
దీనిలో భాగంగా తాజాగా జనసేన వీర మహిళలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.
"నమస్కారం! బాబుని అందరం ఎక్కించాలనా.? కళ్యాణ్ బాబుని సీఎం చేయాలనా.
? ఏమిటి మీ ప్రయత్నం.? వివరంగా వివరించగలరా.
? అని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
ప్రభాస్ స్పిరిట్ మూవీ కథ ఇదేనా.. ఈ కథలో ట్విస్టులు తెలిస్తే షాకవ్వాల్సిందే!