ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మంత్రి అంబటి రాంబాబు..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీకు ఎన్నికల ముగిసాయి.ఎవరు అధికారంలోకి వస్తారు అన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
వైసీపీ.టీడీపీ కూటమి పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొంది.
పైగా పోలింగ్ 80% దాటడంతో.ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే.
ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్ లో( AP Polling ) పాల్గొన్నట్లు కూటమి నేతలు భావిస్తున్నారు.
సాధారణంగా పోలింగ్ లో అత్యధిక శాతం నమోదైతే.ప్రతిపక్షాలకు కలిసొచ్చే పరిస్థితులు ఉంటాయి అని ఎనలిస్ట్ లు చెబుతుంటారు.
దీంతో తామే అధికారంలోకి వస్తామని కూటమి నేతలు అంటున్నారు. """/" /
మరోపక్క పాజిటివ్ క్యాంపెయిన్ తో ఎన్నికల ప్రచారం( Election Campaign ) చేయటంతో పాటు మహిళలు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకోవడంతో తామే అధికారంలోకి వస్తామని వైసీపీ నాయకులు( YCP Leaders ) అంటున్నారు.
ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి ఎన్నికలలో ఏపీలో భారీగా గొడవలు జరిగాయి.
కొన్నిచోట్ల ఈవీఎంలు( EVM ) కూడా ధ్వంసం చేసిన వీడియోలు బయటకు వస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఏపీ పోలింగ్ పై మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) ఏపీ హైకోర్టును( AP High Court ) ఆశ్రయించారు.
సత్తనపల్లి నియోజకవర్గంలో( Sattenapalli Constituency ) 236, 237, 253, 254 వార్డులలో రీపోలింగ్ నిర్వహించాలని పిటీషన్ దాఖలు చేశారు.
ప్రతివాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదు మందిని చేర్చారు.ఈ పిటిషన్ ను ధర్మాసనం రేపు విచారించే అవకాశం ఉంది.
కూర్చున్న యువకుడిపైకి దూసుకొచ్చిన బస్సు.. చివరికి ఏమైందో చూస్తే గుండెలదురుతాయి..!