పురంధేశ్వరిపై మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ మంత్రి అమర్నాథ్( Minister Amarnath ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి పురందేశ్వరి తాపత్రయ పడుతున్నట్లు ఆరోపించారు.చంద్రబాబు( N.

Chandrababu Naidu ) స్క్రిప్ట్ మాదిరిగా పురంధేశ్వరి మాటలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం మీడియా సమావేశంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని పురంధేశ్వరి దుష్ప్రచారం చేస్తున్నట్లు విమర్శించారు.

విశాఖ రైల్వే జోన్ పై కేంద్రంతో ప్రకటన చేయించాలని మంత్రి అమర్నాథ్ సవాలు విసిరారు.

"""/" / టీడీపీ హయాంలో విశాఖలో జరిగిన భూదందాపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.

బీజేపీలో ఉంటూ తెలుగుదేశం పార్టీకి అనాధికారికంగా పురంధేశ్వరి పని చేస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మళ్ళీ జగన్( CM Jagan ) ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.

అంతకుముందు పురంధేశ్వరి విశాఖలో మీడియా సమావేశంలో ఏపీ ప్రభుత్వ పాలన పై మండిపడ్డారు.

కేంద్రం నిధులు ఇస్తుంటుంటే జోబులను నింపుకుంటున్నట్లు విమర్శించారు.కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని సంచలన ఆరోపణలు చేశారు.

రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.దీంతో పురంధేశ్వరి( Daggubati Purandeswari ) చేసిన వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ రాజాగా కౌంటర్ ఇవ్వడం జరిగింది.

ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న ఎన్టీయార్…