అంత ఖర్మ పట్టలేదు అంటున్న మంత్రి అఖిల ప్రియ !

గత కొద్దిరోజుగా పర్యాటక మంత్రి భూమా అఖిల ప్రియ టీడీపీలో ఇమడలేకపోతున్నారు.ఆమె పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తూనే ఉన్నాయి.

అంతే కాకుండా.ఆమె జనసేన పార్టీలోకి జంప్ చేయడం ఖాయమే అన్నట్టుగా కధనాలు కూడా వినిపించాయి.

ఈ వార్తల పై ఆమె స్పందనచారు.ఈ మేరకు కర్నూలులో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

కొందరు పనిగట్టుకుని మరీ తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వీటిని నమ్మొద్దని ప్రజలను కోరారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అంతే కాకుండా.జనసేనలోకి వెళ్లాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు.

ఆళ్లగడ్డ అభివృద్ధికి అడిగినన్ని నిధులు ఇస్తున్న చంద్రబాబుకు ఎందుకు దూరం అవుతానని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని, విజయాన్ని చంద్రబాబుకు కానుగా ఇస్తానని మంత్రి తెలిపారు.