గురువులు కన్నా గూగుల్ మేలు వ్యాఖ్యలను ఖండిస్తున్నా – మంత్రి ఆదిమూలపు సురేష్

రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కామెంట్స్.గురువులు కన్నా గూగుల్ మేలు అని నేను అన్నట్లు వచ్చిన వార్తలను ఖండిస్తున్నా.

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని కొంతమంది గూగుల్ పైన ఆధారపడుతూ గురువులను మరిచిపోతున్నారనే ఉద్దేశ్యంతో మాట్లాడాను.

మా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు.ఉపాధ్యాయుల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిని నేను.

గతంలో విద్యాశాఖ మంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన విద్యాసంస్కరణల్లో నా కృషి, ఉపాధ్యాయ సంఘాలతో నాకున్న సత్సంబంధాలు అందరికీ తెలుసు.

ప్రభుత్వం పైన, ముఖ్యంగా నాపైన వ్యక్తిగతంగా బురదజల్లే కార్యక్రమం ఎల్లోమీడియా చేపట్టింది.అనని మాటలను వక్రీకరించి వారికి అనువుగా పత్రికల్లో ప్రచురించుకునే సంస్కృతి మంచిది కాదు.

పుష్ప ది రూల్ రీలోడెడ్ లో యాడ్ చేసిన సీన్స్ ఇవే.. ఓటీటీలో సైతం ఉంటాయా?