మహారాష్ట్రలో ఎంఐఎం ఎటువైపు?

సుదీర్ఘ రాజకీయ సంక్షోభం తర్వాత మహారాష్ట్రలో ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం అయ్యింది.

అత్యధిక సీట్లు దక్కించుకున్న బీజేపీ కాకుండా రెండవ అతి పెద్ద పార్టీగా నిలిచిన శివసేన పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కింది.

కాంగ్రెస్‌ మరియు ఎన్సీపీలు శివసేన పార్టీకి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది.

ఈ నేపథ్యంలో అక్కడ ఎంఐఎం ఎటువైపు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ప్రకటించాడు.మహారాష్ట్రలో మాకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.

శివసేన మరియు కాంగ్రెస్‌ల కలయికలో ఏర్పడబోతున్న ప్రభుత్వంకు మేము మద్దతు ఇవ్వబోవడం లేదు.

మా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా విపక్షంలో కూర్చుంటారు అంటూ ఓవైసీ ప్రకటించాడు.కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ఎంఐఎం ఓకే చెప్పేది.

కాని శివసేన పార్టీతో ఎంఐఎంకు అస్సలు పొసగదు.రెండు పార్టీలు కూడా పూర్తి విరుద్దమైన పార్టీలు.

శివసేన పార్టీ హిందూ పార్టీ అయితే ఎంఐఎం ముస్లీం పార్టీ అనే విషయం తెల్సిందే.

అందుకే శివసేన ప్రభుత్వంకు మద్దతు ఇచ్చేది లేదని ఓవైసీ ముందే ప్రకటించాడు.

వాటే ఐడియా: ఇలా చేస్తే నీ ఆటో ఎందుకు ఎక్కరు గురూ.. వైరల్ వీడియో.