ఏపీలో ఎంట్రీ ఇచ్చిన ఎంఐఎం పార్టీ..!!
TeluguStop.com

దేశవ్యాప్తంగా ఎంఐఎం పార్టీ చాలా రాష్ట్రాలలో ఎంట్రీ ఇస్తూ ఉంది.ఆరంభంలో తెలంగాణకు పరిమితమైన ఎంఐఎం .


ఇటీవల బీహార్ అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలు మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికలలో పోటీ చేస్తూ ఉంది.


ముస్లిం మైనార్టీ వర్గాన్ని ఆకర్షిస్తూ.దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికల జరిగితే అక్కడ పోటీకి రెడీ అవుతుంది.
పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు.
పార్టీ గెలిచిన గెలవకపోయినా కానీ ముస్లిం ప్రజానీకానికి ఒక పార్టీ అంటూ ఉంది అన్న తరహాలో వారిని ఏకం చేసే రీతిలో అసదుద్దీన్ ఓవైసీ వ్యవహరిస్తుంటారు.
ఇదిలా ఉంటే తాజాగా ఏపీలో కూడా ఎంఐఎం పార్టీ లేటెస్ట్ గా మున్సిపల్ ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చింది.
మేటర్ లోకి వెళ్తే బెజవాడ రాజకీయాల్లో పశ్చిమ నియోజకవర్గంలో రెండు డివిజన్లలో ఎంఐఎం పార్టీ పోటీ చేయడానికి రెడీ అయ్యింది.
ఈ తరుణంలో ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే హుస్సేన్ తాజాగా ప్రచారం నిర్వహించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్నూలులో జరిగిన ఉప ఎన్నికలకు, 2019 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీకి ఎంఐఎం మద్దతు తెలపగా.
, తాజాగా నేరుగా ఎంఐఎం ఏపీ లో ఎంట్రీ ఇవ్వటంతో.ఈ వార్త ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ హెయిర్ ప్యాక్ తో మీ జుట్టు రాలడం కాదు డబుల్ అవుతుంది..!