తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాల్లో ఎంఐఎం పోటీ
TeluguStop.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించింది.ఈ మేరకు హైదరాబాద్ లోని మొత్తం 9 స్థానాల్లో పార్టీ పోటీకి దిగనుందని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.
పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ లో ఎంఐఎం పోటీ చేయనుందని ఓవైసీ తెలిపారు.
ఈ క్రమంలో తొమ్మిది స్థానాలకు గానూ అభ్యర్థులను ఓవైసీ ప్రకటించారు.చాంద్రాయణ గుట్ట - అక్బరుద్దీన్, మలక్ పేట్ - బాలా లా, కార్వాన్ - కౌసర్ మొహిద్దీన్, నాంపల్లి - మాజిద్ హుస్సేన్, చార్మినార్ - జుల్ఫికర్ అలీ, యాకత్ పురా - జాఫర్ హుస్సేన్ లు బరిలో దిగనున్నారని వెల్లడించారు.
అదేవిధంగా పాషాఖాద్రి, ముంతాజ్ ఖాన్ పోటీకి దూరంగా ఉంటారన్న ఓవైసీ వారి సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని తెలిపారు.
వేణు శ్రీరామ్ పరిస్థితి ఏంటి..?ఆయన ఎందుకు భారీ సక్సెస్ ను కొట్టలేకపోతున్నాడు..?