అమెరికా సముద్ర తీరానికి లక్షల్లో చేపలు కొట్టుకొచ్చాయి… ఎందుకంటే?

అవును, మీరు వున్నది నిజమే.అమెరికాలోని టెక్సాస్‌ గల్ఫ్‌ కోస్ట్‌( Texas Gulf Coast ) తీరానికి లక్షల్లో చేపలు కొట్టుకు రావడం ఇపుడు స్థానికంగా చర్చనీయాంశమైంది.

బ్రియాన్‌ బీచ్‌లో మెన్‌హడెన్‌ జాతికి చెందిన చేపలు చనిపోయి కొట్టుకొచ్చాయని ఫాక్స్‌ న్యూస్‌ ఓ కథనంలో పేర్కొనగా దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ కావడం మనం గమనించవచ్చు.

దీనిపై అధికారులు మాట్లాడుతూ.తీవ్రమైన ఎండల కారణంగానే సముద్ర ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోతున్నాయని, దీంతో సరిపడా ఆక్సిజన్‌ అందక చేపలు మృతిచెందుతున్నాయని చెప్పుకొచ్చారు.

"""/" / అవును, ప్రపంచ వ్యాప్తంగా కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు( High Temperatures ) నమోదు అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక ఈ వీడికి నేలపైన వున్న జీవులే కాకుండా నీటిలో వున్న జీవులు కూడా అల్లాడిపోతున్నాయని అంటున్నారు.

దానికి ఉదాహరణగా ఈ సంఘటన నిలిచిందని చెబుతున్నారు.ఇక ఈ విషయాన్నీ వివరిస్తూ.

క్వింటానా బీచ్‌ కౌంటీ పార్క్‌( Quintana Beach County Park ) అధికారులు ''నీళ్లు వేడెక్కితే అందులో ఆక్సిజన్‌ శాతం బాగా తగ్గిపోతుంది.

నీటి ఉష్ణోగ్రత 70 డిగ్రీల ఫారన్‌హీట్‌ కంటే ఎక్కువైతే మెన్‌హెడెన్‌ లాంటి చేపలు సముద్రంలో మనుగడ సాగించలేవు.

ఈ కారణంగానే అవి లక్షల్లో చనిపోయాయి.'' అని వెల్లడించారు.

"""/" / ఇకపోతే మెన్‌హెడెన్‌ ( Menhaden )జాతికి చెందిన చేపలు అనేవి గుంపులు గుంపులుగా జీవిస్తూ ఉంటాయి.

ఒక్కో గుంపులో వందల కొద్దీ చేపలు ఉంటాయి.కెనడా తీరం నుంచి దక్షిణ అమెరికా వరకు ఇవి అలా సంచరిస్తూ ఉంటాయి.

ఇవి సమూహాలుగా ఉండడం వలన సమస్యలు వచ్చినపుడు వేల సంఖ్యలో ఒకేసారి అన్ని చేపలు చనిపోతూ ఉంటాయి.

తాజా ఘటన కూడా అదే కోవలోకి వస్తుందని అధికారులు అంటున్నారు.ఇకపోతే నీటి అడుగుభాగం కంటే ఉపరితల జలం అనేది త్వరగా వేడెక్కుతుంది.

అదే సమయంలో చేపల గుంపు అందులో చిక్కుకుంటే మొప్పల ద్వారా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ప్రాణాలు కోల్పోతాయి.

నేను మీసం తిప్పితే ఓట్లు పడతాయా ? క్లాస్ పీకిన పవన్