ఇంటిలో నుంచి పారిపోయిన కోటీశ్వరుడి కుమారుడు,చివరికి కప్పులు కడుగుతూ

కోటీశ్వరుడి కుమారుడు అంటేనే జల్సాలు,రాజభోగాలు అనుభవిస్తూ జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు అని అందరూ భావిస్తారు.

అయితే ఎంత కోటీశ్వరుడు అయినా కష్టం వచ్చినప్పుడు అందరి లాగానే అమ్మ అనే పిలుస్తాడు అన్న విషయం మాత్రం మర్చిపోతారు.

కేవలం ఇంటిలో చదువు కోవాలని ఒత్తిడి తెచ్చిన కారణంగా రాజభోగాలు అనుభవించాల్సిన ఆ యువకుడు ఇంటిలో నుంచి పారిపోయి చివరికి హోటల్లో కప్పులు కడుక్కొని పరిస్థితి తెచ్చుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.గుజరాత్ కు చెందిన కోట్లలో వ్యాపారం చేసే ఒక వ్యాపారి కుమారుడు ద్వారకేష్ థక్కర్(19).

అయితే అతడు కాలేజీ కి వెళ్లి చదువుకోవడం ఇష్టం లేకపోవడం దానికి తల్లిదండ్రులు అతడిపై ఒత్తిడి తెచ్చి చదువుకోమని చెప్పడం తో అక్టోబర్ 14 వ తేదీన కాలేజీ కి వెళుతున్నానని చెప్పి వడోదర రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ నుంచి ఢిల్లీ కి పారిపోయినట్లు తెలుస్తుంది.

"""/"/అయితే తమ కుమారుడు కనిపించకుండా పోవడంతో ద్వారకేష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో పోలీసులు ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది.

ఇంటి నుంచి బయటకు వచ్చిన అతడు ఓ ఆటోలో వెళ్లినట్టు గుర్తించి ఆ ఆటోవాలాను పట్టుకోగా, అతడు వడోదర రైల్వేస్టేషన్‌లో దిగినట్టు ఆటోడ్రైవర్ చెప్పాడు.

అప్పుడు రైల్వే స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా,ఢిల్లీ రైలు ఎక్కినట్టు గుర్తించారు.ఈ క్రమంలో సిమ్లా వెళ్లిన ద్వారకేష్ అక్కడ రోడ్డుపక్కన టిఫిన్ బండ్ల వద్ద పనిచేస్తూ వారు ఇచ్చినది తింటూ గడిపాడు.

ఈ క్రమంలో ఓ హోటల్ వద్దకు వెళ్లి పనికావాలని అడిగాడు.అయితే, అతడి వాలకం చూసిన హోటల్ యజమానికి అనుమానం వచ్చింది.

ద్వారకేష్ వద్ద తనిఖీ చేయగా ఓ ఐడీ కార్డు కనిపించింది.ఆ ఐడీ కార్డు మీద గుజరాత్‌లోని పాద్రా అడ్రస్ ఉంది.

ఆ హాటల్ యజమాని వెంటనే ఇంటర్నెట్‌లో వెతికి.సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశాడు.

హోటల్ యజమాని నుంచి ఫోన్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.ద్వారకేష్ ఫొటోను అతడికి పంపి.

వివరాలు క్రాస్ చెక్ చేసుకున్నాడు.అతడు ద్వారకేష్ అని ఖరారవ్వడం తో అక్కడ అతడిని పట్టుకొనే ప్రయత్నం చేశారు.

దీనితో చివరికి ఒక ప్లాట్ ఫామ్ పై పడుకున్న ద్వారకేష్ ని పట్టుకున్న పోలీసులు అతడి తల్లి దండ్రులకు సమాచారం అందించడం తో వెంటనే ఫ్లైట్ ద్వారా అక్కడకి చేరుకొని కొడుకు పరిస్థితి చూసి వారు కన్నీరు మున్నీరు గా విలపించారు.

కొత్త కోడలి గురించి నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎంతో ఆనందంగా ఉంటూ?