తమన్నాకు ఇష్టమైన వంటకాలు ఏంటో మీకు తెలుసా?
TeluguStop.com
మిల్కీ బ్యూటీ తమన్నా శ్రీ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టి అవకాశాలు తగ్గిన ప్రతిసారి సక్సెస్ ను సొంతం చేసుకుంటూ నటిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
వయస్సు పెరుగుతున్నా తమన్నా చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు అయితే ఉన్నాయి.బాహుబలి సక్సెస్ తో తమన్నాకు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే.
తెలుగులోనే ఎక్కువగా ఆఫర్లు సొంతం చేసుకున్న తమన్నా తనకు ఆవకాయ, పూతరేకులు అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు.
దక్షిణాది భాషల్లో తాను సినిమాలు చేసినా తెలుగమ్మాయిగానే తనను గుర్తిస్తారని ఈ బ్యూటీ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం సీటీమార్, ఎఫ్3, గుర్తుందా శీతాకాలం సినిమాలలో తమన్నా నటిస్తున్నారు.ముంబైలో ఉండే తన స్నేహితులకు మాత్రం హైదరాబాదీ బిర్యానీ అంటే ఇష్టమని ఆమె చెబుతున్నారు.
మాస్టర్ చెఫ్ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరించడం ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాంతీయ వంటకాల గురించి తెలుసుకున్నానని తమన్నా అన్నారు.
"""/"/
తెలుగుతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తమన్నా చేతిలో సినిమా ఆఫర్లు ఉన్నాయి.
మేస్ట్రో సినిమాలో తమన్నా కీలక పాత్రలో నటించగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి.
ఈ బ్యూటీ వచ్చిన ప్రతి ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటూ నటిగా సత్తా చాటుతుండటం గమనార్హం.
కథ నచ్చితే తమన్నా వెబ్ సిరీస్ లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
"""/"/
ప్రస్తుతం ఏ సీనియర్ హీరోయిన్ లేనంత బిజీగా ఉన్న తమన్నా కొత్త కథలు కూడా వింటున్నారని తెలుస్తోంది.
తమన్నా ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు కూడా హిట్టైతే మరో రెండేళ్ల వరకు తమన్నా ఆఫర్లతో బిజీగా ఉంటూ కెరీర్ ను కొనసాగించే అవకాశాలు అయితే ఉంటాయి.
రైలులో చోటులేదనేమో.. 290 కి.మీ. ఏకంగా రైలు కోచ్ కింద ప్రయాణించిన వ్యక్తి