అసలే అవకాశాలు లేవు.. ఈ సమయంలో పంతం అవసరమా?
TeluguStop.com
మిల్కీ బ్యూటీ తమన్నా పరిస్థితి గతంలో మాదిరిగా లేదు అనడం లో సందేహం లేదు.
ఆమె గతంలో స్టార్ హీరోలకు జోడీ గా ఆఫర్లు దక్కించుకుంది.సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఈ అమ్మడు నిలిచింది.
కానీ ఇప్పుడు ఈమె పెద్దగా ఆఫర్లను దక్కించుకోలేక పోతుంది.అంతే కాకుండా ఈమె యొక్క క్రేజ్ కూడా తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది.
చిన్న సినిమా లు మరియు వెబ్ సిరీస్ లకు కెరీర్ పరిమితం అవుతున్న సమయంలో తమన్నా కాస్త మేకర్స్ కి అంది ఉండాలి అనేది కొందరి అభిప్రాయం.
కానీ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం ఇప్పటికి కూడా నిర్మాతలకు అందనంత దూరం లో ఉంటుంది అంటూ విమర్శలు వస్తున్నాయి.
పారితోషికం విషయంలో తగ్గడం లేదు.పైగా ఈ అమ్మడు వరుసగా చేస్తున్న సినిమా లకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది.
ఈ కారణంగా మిల్కీ బ్యూటీ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటూ కొందరు సినిమా నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అసలే ఆఫర్లు తక్కువ వస్తున్న ఈ సమయంలో సినిమా ల యొక్క ప్రమోషన్స్ లో పాల్గొనకుండా నిర్మాతల ఆగ్రహం కు గురి అయితే ముందు ముందు ఆఫర్లు ఎలా వస్తాయి అంటూ కొందరు సినీ విశ్లేషకులు తమన్నా ను ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయం లో మిల్కీ బ్యూటీ సమాధానం ఏంటీ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
హీరోయిన్ గా తమన్నా ఇటీవల నటించిన ఒక సినిమా యొక్క ప్రమోషన్ కు పూర్తి దూరంగా ఉంది.
పారితోషికం ఇష్యూ కారనంగా ప్రమోషన్ లో పాల్గొనలేదు అనేది మరి కొందరి మాట.
అసలు విషయం ఏంటీ అనేది ఆమె నోరు విప్పితే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
తన ఫ్లాప్ సినిమాల గురించి జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే?