మెగా హీరో సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ ?
TeluguStop.com
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దశాబ్దం పైగానే అవుతుంది.
అయినా ఇప్పటికి కుర్ర హీరోయిన్స్ కు పోటీగా అవకాశాలు అందుకుంటుంది.మధ్యలో కొన్ని రోజులు వరుస ప్లాప్స్ కారణంగా అవకాశాలు తగ్గిన కూడా పట్టువదల కుండా అవకాశాలు అందుకుని ఇప్పుడు మళ్ళీ దూసుకు పోతుంది.
అటు హీరోయిన్ గా చేస్తూనే ఇటు అవకాశం వస్తే స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపిస్తుంది.
"""/"/
తమన్నా దగ్గరకు ఏ అవకాశం వచ్చిన వదులు కోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది.
అంతేకాదు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది.అయితే తాజాగా వస్తున్న వార్తలు ప్రకారం తమన్నా మరొక ఐటెం సాంగ్ లో అవకాశం అందుకుందని టాక్ వినిపిస్తుంది.
మరోసారి మెగా హీరో సినిమాలో ఐటెం సాంగ్ లో ఆడిపాడ బోతుందని తెలుస్తుంది.
ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని సినిమాలో నటిస్తున్నాడు.కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.
ఇందులో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ ని తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
"""/"/
ఇప్పటికే ఈ ఐటెం సాంగ్ కు సంబంధించి షూటింగ్ కూడా జరిగిందని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.
ఈ మధ్యనే మిల్కీ బ్యూటీ తమన్నా సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఐటెం సాంగ్ లో ఆడిపాడింది.
ఇప్పుడు మెగా హీరోతో మరొక సారి చిందేయ బోతుంది.అదే నిజమైతే తమన్నా స్టార్ డమ్ కూడా ఈ సినిమాకు ప్లస్ కాబోతుంది.
మొత్తానికి తమన్నా ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.
ఆయన బాలయ్య కాదు… ఎప్పుడు నాకు సారే … పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!