ఆ ఆలయంలో రాహువుకు పాలు పోస్తే.. నీలంగా మారతాయ్
TeluguStop.com
మన పురాతణ ఆలయాల్లో సైన్స్ కు కూడా అంతు చిక్కని విచిత్రమైన విశేషాలు ఉన్నాయి.
వాటిలో ఒకటి.తమిళనాడు కుంబకోణం లోని తిరు నాగలింగేశ్వర ఆలయం.
ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, నాగదోషంతో బాధపడేవారు.రాహుకాలంలో రాహువుకి పాలుపోస్తే… అవి నీలి రంగులోకి మారిపోతాయి.
అవి కింద పడిన తర్వాత తెల్ల రంగులోకి వస్తాయి.ఇక్కడ శివుడిని నాదనాదేశ్వరుడుగా, అమ్మవారిని గిరిజకుజలాంబికగా పిలుస్తారు.
ఈ ఆలయం సముద్ర మట్టానికి అతి దగ్గరగా ఉండటం వల్ల… ఆలయం బయట అంతా ఇసుక మేట ఉంటుంది.
ఈ ఆలయంలో ప్రధానంగా పూజ లందుకుంటున్నది రాహువు.గర్భాలయంలో తన భార్యలైన నాగరాజ సింహ, చిత్రరేఖలతో రాహువు కొలువై ఉంటాడు.
నాగ దోషంతో బాధపడేవారు ఈ ఆలయానికి వచ్చి… రాహువుకి పాలు పోస్తే… తమ దోషం పోతుందని ప్రతీతి.
ఇలా రాహు కాలంలో పాలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాలు కంఠం నుంచి దిగగానే ” గొంతు వద్ద నీలం రంగు గా మారుతుంది.
ఆ పాలు నేలపై పడినప్పుడు తెల్లగా కావడం విశేషం.ఈ వింతను చూడడానికి రాహుకాలంలో భారీ సంఖ్యలో హాజరవుతారు.
ఇలా పాలు నీలి రంగులోకి మారడానికి కారణం.నాగమణి అని పురాణాల కథనం.
ఈ నాగమణి గురించి విష్ణు పురాణం, గరుడపురాణంలో కూడా ఈ నాగమణి ప్రస్తావన వుందంట.
ఈ ఆలయాన్ని దర్శించు కోవడానికి శనివారం ఉదయం 11కి లేదా ఆదివారం సాయంత్రం 4-6 మధ్య మాత్రమే వెళ్ళాలి.
చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత… అదే నా కోరిక అంటూ?