పాల మీగ‌డ‌లో ఇవి క‌లిపి రాస్తే.. ముఖం మెరిసిపోవాల్సిందే!

ముఖం అందంగా, కాంతివంతంగా క‌నిపించాల‌ని కోరుకోవ‌డం స‌హ‌జ‌మే.కానీ, అందుకు భిన్నంగా ఎప్పుడూ ఏదో ఒక చ‌ర్మ స‌మ‌స్య వ‌చ్చి ప‌డుతుంటుంది.

ముఖ్యంగా చాలా మంది కామ‌న్‌గా మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు, డ్రై స్కిన్, డార్క్ స్పాట్స్ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు.

అయితే వీట‌న్నిటికీ చెక్ పెట్టి ముఖాన్ని అందంగా మెరిపించ‌డంలో పాల మీగ‌డ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి పాల మీగ‌డ‌ను ముఖానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ పాల మీగ‌డ‌, అర టీ స్పూన్ శెన‌గ‌పిండి మ‌రియు చిటికెడు ప‌సుపు వేసి బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.ఇర‌వై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారినికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై మృత క‌ణాలు, మ‌లినాలు తొల‌గి.

ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.రెండొవ‌ది.

ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ పాల మీగ‌డ, కొద్దిగా నిమ్మ‌ర‌సం మ‌రియు అర టీ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.అర ‌గంట పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా వారినికి రెండు లేదా మూడు సార్లు చేస్తే.

ముఖంపై మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గుతాయి.మూడొవ‌ది.

ఒక బౌల్‌లో ఒక స్పూన్ పాల మీగ‌డ, ఒక స్పూన్ కీరా దోస ర‌సం, అర స్పూన్ రోజ్ వాట‌ర్ వేసి బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మానికి ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.పావు గంట పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముడ‌త‌లు పోయి.

ముఖం మృదువుగా, ప్ర‌కాశవంతంగా మారుతుంది.

వీడియో: ఇదెక్కడి వింత బిర్యానీ.. అవతార్ కలర్‌లా ఉందే..?