ఏం చేస్తే ఆనందంగా ఉంటావో అది చెయ్.. మిహిక ఇన్స్టా స్టోరీ వెనుక కథేంటో?
TeluguStop.com
సోషల్ మీడియా ప్రభావం ఎప్పుడైతే మొదలైందో అప్పటినుంచి చాలామంది సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు.
తమ మనసులో ఉన్న విషయాలను పోస్టుల ద్వారా బయట పెడుతూ ఉంటారు.కేవలం సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా అలానే చేస్తారు.
తమకు ఏదైనా అనిపిస్తే దానిని సోషల్ మీడియాను వేదికగా ఎంచుకొని అందులోనే అనేస్తారు.
ఒకరిని తిట్టాలన్న, ఒకరిని మెచ్చుకోవాలన్న లేదా తమ గురించి తాము బాధపడుతున్న ఫీలింగ్స్ ను బయట పెట్టుకోవాలన్న సోషల్ మీడియాను బాగా వాడుకుంటారు.
ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు అలానే చేశారు.చేస్తున్నారు కూడా.
అయితే కొన్ని కొన్ని సార్లు తమ గురించి తాము బాధపడుతున్న ఫీలింగ్స్ ను బయట పెట్టినప్పుడు ఆ పోస్ట్ చూసే వాళ్లకు కొన్ని అనుమానాలు వస్తుంటాయి.
ఇప్పుడు అటువంటి అనుమానమే ఓ స్టార్ హీరో భార్య నుండి ఎదురయింది.ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరో కాదు రానా.
ఇక అతని భార్య మిహిక బజాజ్ చేసిన పోస్టు వల్లే ఇప్పుడు అందరికీ అనుమానాలు వస్తున్నాయి.
ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రానా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
"""/"/
దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా, విలన్ గా బాగానే మెప్పిస్తున్నాడు.
ఇక ఇతని భార్య మిహిక గురించి అందరికీ తెలిసిందే.గతంలో రానా మిహిక ను కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు.
ఇక పెళ్లి తర్వాత ఈ జంట చూడముచ్చటగా అందరి దృష్టిలో పడ్డారు.ఇక మిహిక కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది.రానా కూడా తమ ఫ్యామిలీ ఫోటోలను బాగా పంచుకుంటాడు.
గతంలో మిహీకా ప్రెగ్నెంట్ అని పుకార్లు రాగా వెంటనే వాటికి చెక్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
అంతే కాకుండా తమ విడాకుల గురించి కూడా బాగా పుకార్లు రాగా వాటికి కూడా చెక్ పెట్టింది.
ఆ మధ్య రానా తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలను కూడా డిలీట్ చేశాడని.
"""/"/
దీంతో అందరూ ఈ జంట మధ్య గొడవలు జరిగాయి అని.అందుకే ఆయన సోషల్ మీడియా నుండి బయటికి వచ్చాడని.
ఫోటోలు డిలీట్ చేసి ముందుగానే హింట్ ఇచ్చాడు అని పెళ్లి రోజే బయటపడింది.
దీంతో అప్పుడే ఈ పుకార్లకు ఆయన భార్య మిహిక ఫుల్స్టాప్ పెట్టింది.అయినా కూడా వీరిద్దరికీ పడట్లేదు అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి.
అందుకే ఆమె భర్తతో కొత్త ఫోటోలు దిగకుండా పాత ఫోటోలోనే పంచుకుంది అని అనుమానం పడుతున్నారు.
అయితే తాజాగా ఆమె ఒక పోస్ట్ షేర్ చేయగా ఆ పోస్ట్ బాగా వైరల్ అవుతున్నాయి.
ఇక ఆమె చేసిన పోస్ట్ చూస్తే.అందులో నువ్వు ఏ పని చేస్తే ఆనందంగా ఉంటావో ఆ పని చేయు అన్నట్లు పెట్టింది.
దీంతో ఈమె చేసిన పోస్ట్ చూసిన నెటిజన్స్.ఈ స్టోరీ వెనుక ఏముంది అని అనుమానం పడుతున్నారు.
తాను కావాలని రానా ను ఉద్దేశించి అన్నదేమో అని మళ్ళీ అనుమానపడుతున్నారు.
శ్రీ తేజ్ ను పరామర్శించిన సుకుమార్.. 5 లక్షల సాయం చేసిన డైరెక్టర్ వైఫ్!