యూఎస్-కెనడా బోర్డర్‌లో పడవ ప్రమాదం.. వలసదారుల జలసమాధి, మృతుల్లో మా బంధువులు : గుజరాతీ వ్యక్తి

దొడ్డిదారిన అమెరికాలోకి వెళ్తూ యూఎస్ కెనడా బోర్డర్‌లోని( US-Canada Border ) నదిలో ఒక భారతీయ కుటుంబం సహా ఎనిమిది మంది జలసమాధి అయిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.అయితే మృతుల్లో తమ వారు వున్నట్లుగా గుజరాత్‌లోని ( Gujarat ) మెహసానా జిల్లాకు చెందిన కుటుంబం భావిస్తోంది.

విజాపూర్ తాలుకాలోని మానెక్‌పూర్ గ్రామానికి చెందిన జసుభాయ్ చౌదరి( Jasubhai Chowdary ) ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.

తన సోదరుడు, మరదలు, వారి ఇద్దరు పిల్లలు టూరిస్ట్ వీసాపై రెండు నెలల క్రితం కెనడాకు వెళ్లారని చెప్పారు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం భారతీయ వలసదారులు ప్రమాదవశాత్తూ చనిపోయారన్న వార్త తెలుసుకున్నానని చౌదరి తెలిపారు.

తీవ్ర భయాందోళనల మధ్య తన సోదరుడిని సంప్రదించడానికి ప్రయత్నించానని.కానీ కుదరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు.కెనడాలో మరణించిన నలుగురి మృతదేహాలను స్వగ్రామానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలంటూ మలేక్‌పురా గ్రామవాసులు కలెక్టర్‌ను సంప్రదించారు.

"""/" / కెనడాకు వెళ్లిన నలుగురిని ప్రవీణీ చౌదరి (50), అతని భార్య దీక్ష (45), కుమారుడు మీత్ (20), కుమార్తె విధి (24)గా గుర్తించారు.

ఈ ఘటనపై గుజరాత్ మాజీ హోంమంత్రి విపుల్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ.బాధితుల మృతదేహాలను ఇక్కడికి తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇది చాలా విచారకరమని విపుల్ చౌదరి అన్నారు.ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే, మృతదేహాలను తిరిగి స్వస్థలానికి తీసుకురావడానికి ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

"""/" / ఇకపోతే.గతేడాది జనవరిలో అమెరికా - కెనడా సరిహద్దుల్లో గడ్డకట్టిన స్థితిలో ఒక చిన్నారి సహా నలుగురు భారతీయులు శవాలుగా తేలిన వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

మృతులను జగదీష్ పటేల్, అతని భార్య వైశాలి పటేల్, వారి పిల్లలు విహంగీ పటేల్, ధార్మిక్ పటేల్‌గా గుర్తించారు.

వీరి మృతదేహాలు విన్నిపెగ్‌కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో వున్న ఎమర్సన్‌కు తూర్పున మంచు కప్పబడిన పొలంలో కనిపించాయి.

వీరు కూడా గుజరాతీయులే కావడం గమనార్హం.ఆ తర్వాత మార్చి 2022లో కెనడా సరిహద్దుకు సమీపంలో వున్న సెయింట్ రెగిస్ నదిలో పడవ మునిగిన ఘటనలో గుజరాత్‌కు చెందిన ఆరుగురు యువకులను H3 Class=subheader-styleఅమెరికా అధికారులు/h3p అరెస్ట్ చేశారు.

వీరంతా యూఎస్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని అధికారులు తెలిపారు.

నా పెళ్లిలో ఆ హీరో గుక్క పట్టి ఏడ్చాడు.. ఖుష్బూ చెప్పిన విషయాలకు షాకవ్వాల్సిందే!