తెలంగాణపై మిగ్ జామ్ ఎఫెక్ట్.. రెండు రోజులు భారీ వర్షాలు

మిగ్ జామ్ తుఫాను ప్రభావం తెలంగాణపై కూడా పడింది.ఈ మేరకు రానున్న రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇవాళ, రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించిన వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది.

అలాగే సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది.మిగ్ జామ్ తుఫాను నేపథ్యంలో తెలంగాణ సీఎస్ అప్రమత్తం అయ్యారు.

ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతకుమారి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.వర్ష పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు కార్చగల టాలెంటెడ్ యాక్టర్లు.. ఎవరంటే..