ప్రపంచాన్ని ఊపేస్తున్న మైక్రోవేవ్ ఛాలెంజ్... అసలేంటో దీని గురించి తెలుసుకుందామా
TeluguStop.com
ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా పరిధి అమాంతం పెరిగి పోయింది.ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.
సోషల్ మీడియా పరిధి ఇంతగా పెరగకముందు వచ్చిన మొదటి ఛాలెంజ్ ఐస్ బక్కెట్ ఛాలెంజ్.
ప్రపంచ దిగ్గజాలు ఎంతో మంది ఈ ఐస్ బక్కెట్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.పలువురు ఐస్ బక్కెట్ ఛాలెంజ్‌ను స్వీకరించారు.
ఒక వింత వ్యాదితో బాధపడుతున్న వారికి మద్దతుగా ఆ ఛాలెంజ్ ప్రారంభం అయ్యింది.
ఆ తర్వాత ఎన్నో ఛాలెంజ్‌లు వచ్చాయి.చాలా ఛాలెంజ్‌లు వచ్చినా కూడా ఐస్ బక్కెట్ ఛాలెంజ్ స్థాయిలో కీకీ ఛాలెంజ్ వచ్చింది.
కారు నడుస్తున్న సమయంలో దాని నుండి దిగి డాన్స్ చేయడంను కీకీ ఛాలెంజ్‌గా పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ కొనసాగుతూనే ఉంది.అయితే కొన్ని అర్థం పర్థం లేని ఛాలెంజ్‌లు కూడా వస్తున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న ఛాలెంజ్ మైక్రోవేవ్ ఛాలెంజ్.ఈ ఛాలెంజ్ పేరుతో వింత వింత ప్రవర్తనలు చేస్తూ బాబోయ్ అనిపిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ వీడియోలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.మైక్రోవేవ్‌లో ఆహారం పెడితే అది గుండ్రగా తిరుగుతూ ఎలా అయితే వేడి అవుతుందో అలాగే బయట మైక్రోవేవ్‌లోని ప్లేట్ మాదిరిగా గుండ్రగా తిరుగుతూ ఛాలెంజ్ చేస్తున్నారు.
విదేశాల్లో అత్యధికులు ఈ ఛాలెంజ్ చేస్తున్నారు.ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్, టిక్‌టాక్ ఇలా అన్నింట్లో కూడా ఈ మైక్రోవేవ్ ఛాలెంజ్ కనిపిస్తూనే ఉంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" /
ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నారు అనే విషయం ఎవరికి తెలియదు.
ఏదో సరదాకు చేస్తున్నాం అంటూ అంతా పెడుతున్నారు.అర్థం పర్థం లేని వీడియోలు అంటూ అంతా కూడా విమర్శలు చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో మైక్రోవేవ్ ఛాలెంజ్ వైరల్ అవుతూనే ఉన్నాయి.
Lorem Ipsum Dolor Sit Amet