వీడియో కాల్స్ చేస్తున్నారా?అయితే ట్రాయ్ హెచ్చరిక ఏంటో తెలుసుకోండి.

కరోనా కారణంగా దాదాపు అన్ని సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశాన్ని కల్పించాయి.

దీనితో ఆఫీస్ వర్క్ కోసం ఉద్యోగాలు తమ సహాద్యోగులతో మాట్లాడటానికి జూమ్, మైక్రోసాఫ్ట్ యాప్స్ ఉపయోగిస్తున్నారు.

ఇక్కడి వరకు అంతాబాగానే ఉంది ఇక అసలు సమస్య ఏంటంటే టోల్ ఫ్రీ నంబర్లను ఉపయోగించనివారికి ఇంటర్నేషనల్ కాలింగ్ రేట్స్ వర్తిస్తున్నాయి.

దీనితో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి.ఈ సమస్యను ఎదుర్కొంటున్న చాలామంది కంప్లైంట్స్ ఇస్తున్న నేపథ్యంలో ట్రాయ్ సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది.

టెలికాం కంపెనీలు తమ సబ్‌స్క్రైబర్స్‌కు టోల్ ఫ్రీ నంబర్లను ఉపయోగించని యెడల ఇంటర్నేషనల్ కాలింగ్ రేట్స్ వర్తిస్తాయని అలర్ట్స్ పంపించాయి.

ఇక ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ వినియోగించే వాళ్ళు ఇంటర్నేషనల్ చార్జెస్ పడకుండా ఉండడం కోసం లాగిన్ అయినప్పుడు.

బిల్ట్-ఇన్-ఆడియో ఆప్షన్‌ని ఉపయోగిస్తే ఎలాంటి సమస్య ఉండదు కానీ ఎక్కువమంది ఫోన్ ను వినియోగిస్తున్నారు.

దాని ఫలితంగానే ఐఎస్‌డీ చార్జీలు వర్తించి బిల్ తడిచి మోపెడు అవుతుందని ట్రాయ్ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు.

"""/"/ ఇక కరోనా మొదలైనప్పటి నుండి వీడియో యాప్ డౌన్లోడ్ భారత్ లో భారీగా పెరిగిపోయాయి.

వీటిని క్యాష్ చేసుకోవడానికి భారతీ ఎయిర్‌టెల్ బ్లూ జీన్స్ యాప్‌ను అలాగే జియో సంస్థ జియో మీట్ అనే వీడియో కాన్ఫరెన్స్ యాప్‌ను లాంచ్ చేశాయి.

వీటి ప్రభావం భారతీయులపై నామమాత్రముగా ఉంది.

తన ఫ్లాప్ సినిమాల గురించి జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే?