మైక్రోసాఫ్ట్ అప్‌డేట్‌: విండోస్‌ 11లో ఈ కొత్త నోట్‌ప్యాడ్‌ గమనించారా?

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ టెక్ రంగంలోనే విశేష సేవలు అందిస్తోంది.కంప్యూటర్‌ వినియోగించే ప్రతి ఒక్కరికి మైక్రోసాఫ్ట్‌ ప్రొడక్టులను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌లకు అప్‌డేట్స్‌ను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది మైక్రోసాఫ్ట్.కాగా తాజాగా మైక్రోసాఫ్ట్ నోట్‌ప్యాడ్ అప్లికేషన్‌ కొత్త అప్‌డేట్‌ను ప్రకటించింది.

నోట్‌ప్యాడ్‌కు ట్యాబ్స్‌ రూపంలో సరికొత్త ఫీచర్స్‌లను యాడ్‌ చేయనుంది.మైక్రోసాఫ్ట్ గత ఏడాదే విండోస్ 11ని లాంచ్ చేసింది.

ఇపుడు తాజాగా అందులో నోట్‌ప్యాడ్‌ యాప్‌కి కొన్ని అప్‌డేట్స్‌ ప్రకటించింది.ఈ అప్‌డేట్‌తో డార్క్ మోడ్ ఫీచర్, రీ డిజైన్ చేసిన ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్‌లు అందిస్తోంది.

దాదాపు ఒక సంవత్సరం తర్వాత నోట్‌ప్యాడ్‌కు మరిన్ని ఫీచర్‌లను యాడ్ చేయబోతున్నట్టు ప్రకటిస్తోంది.

ఈ అప్‌డేట్‌తో నోట్‌ప్యాడ్‌కు మరిన్ని ట్యాబ్‌లు యాడ్‌ అవుతాయని సమాచారం.దీనికి సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌ను ఓ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి తన ట్విట్టర్ అకౌంట్లో అనుకోకుండా బయటపెట్టాడు.

"""/"/ ఇకపోతే అతను పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్ డిలీట్ చేసినప్పటికీ.సమాచారం మాత్రం బయటకు పొక్కింది.

ఆ స్క్రీన్‌షాట్‌లో రెండు ట్యాబ్‌లు ఓపెన్ అయి ఉన్నాయి.స్క్రీన్ షాట్లు, ఫీచర్ల గురించి డిస్కస్ చేయవద్దని ఆ ట్యాబ్‌లో ఉంది.

ఆ వార్నింగ్ మెసేజ్ ద్వారా ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలో ఉందని అర్ధం అవుతోంది.

2023లో ఈ అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇదే నిజమైతే.నోట్‌ప్యాడ్‌ యాప్‌ మైక్రోసాఫ్ట్ ఫైల్స్ యాప్ తర్వాత టాబ్స్ ఆప్షన్ పొందే రెండో అప్లికేషన్‌గా నిలుస్తుంది.

వీడియో: బుర్కా వేషంలో దొంగ.. తెలివిగా చోరీని అడ్డుకున్న జ్యువలరీ షాప్ ఓనర్…??