మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తండ్రి మృతి

ప్రపంచంలోనే దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా మన తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.

ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కించుకున్న సత్య నాదెళ్ల తండ్రి ఒక మాజీ ఐఏఎస్‌ ఆఫీసర్‌.

నేడు సత్య నాదెళ్ల తండ్రి యుగందర్‌ అనారోగ్యంతో కన్నుమూశారు.గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేదు.

హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ యుగందర్‌ గారు మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యుల నుండి ప్రకటన వచ్చింది.

పీవీ నరసింహారావు హయాంలో గ్రామీణాభివృద్ది శాఖలో కీలక బాధ్యతలు పోషించిన యుగందర్‌ గారు యూపీఏలో పాలన ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు.

ఐఏఎస్‌ అధికారిగా చాలా నిబద్దతతో పని చేయడంతో పాటు, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

1962 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన యుగందర్‌ గారి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర దు:ఖంలో మునిగి పోయారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రముఖులు యుగందర్‌కు నివాళ్లు అర్పించారు.

యూఎస్: కోటీశ్వరులు దాక్కునేందుకు సీక్రెట్ బంకర్.. ఇందులో ఉంటే ప్రళయం వచ్చినా టెన్షన్ లేదు!