పెద్ద తప్పు చేశామంటూ పశ్చాత్తాప వ్యాఖ్యలు చేసిన మైక్రోసాఫ్ట్ సీఈవో..!

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు రాణిస్తున్నాయి కానీ మైక్రోసాఫ్ట్( MicroSoft ) మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యింది.

అయితే తాజాగా మొబైల్స్ విషయంలో కంపెనీ వైఫల్యంపై మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల( Satya Nadella ) విచారం వ్యక్తం చేశారు.

మెరుగ్గా మేనేజ్‌మెంట్ చేస్తే మొబైల్ మార్కెట్‌లో సక్సెస్ అయ్యే వాళ్ళమని పశ్చాత్తాప వ్యాఖ్యలు చేశారు.

మైక్రోసాఫ్ట్ గతంలో గూగుల్ ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్‌లకు పోటీగా విండోస్ స్మార్ట్‌ఫోన్లను( Windows Phone ) విడుదల చేసింది, అయితే అవి వినియోగదారులలో ఆదరణ పొందడంలో విఫలమయ్యాయి.

అయితే 2017లోనే మైక్రోసాఫ్ట్ విండోస్ 10 మొబైల్‌ల కోసం కొత్త ఫీచర్లు లేదా హార్డ్‌వేర్‌ను అభివృద్ధి చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

రెండు సంవత్సరాల తర్వాత, విండోస్ 10 మొబైల్ వినియోగదారులు కూడా సెక్యూరిటీ అప్‌డేట్స్‌, బగ్ ఫిక్సెస్, సపోర్ట్‌ను స్వీకరించలేకపోయారు.

బిజినెస్ ఇన్‌సైడర్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, 2014లో తాను సీఈఓ అయినప్పుడు స్మార్ట్‌ఫోన్ వ్యాపారం నుంచి నిష్క్రమించడానికి కష్టమైన నిర్ణయం తీసుకున్నానని నాదెళ్ల అంగీకరించారు.

వాటిని సక్సెస్ చేసేందుకు ఒక మార్గాన్ని ప్రయత్నించి ఉంటే బాగుండేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.

"""/" / నాదెల్లా 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా స్టీవ్ బాల్మెర్( Steve Ballmer ) స్థానాన్ని భర్తీ చేశారు.

2015లో, అతను ప్రధానంగా ఫోన్ వ్యాపారంలో 7,800 ఉద్యోగాలను తగ్గించాలని నిర్ణయించుకున్నారు.నోకియా ఫోన్( Nokia Phone ) వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి సంబంధించిన $7.

6 బిలియన్లను రద్దు చేశారు.మైక్రోసాఫ్ట్ సొంత పరికరాలను కలిగి ఉన్న ఒక శక్తివంతమైన విండోస్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడం, సృష్టించడంపై దృష్టి పెట్టడం తన వ్యూహమని ఆయన వివరించారు.

"""/" / అయినప్పటికీ, మైక్రోసాఫ్ట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుంచి తప్పుకోవడం దాని సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈఓలలో కొందరికి అసలు నచ్చలేదు.

ఉదాహరణకు బిల్ గేట్స్( Bill Gates ) మైక్రోసాఫ్ట్‌ను ఆండ్రాయిడ్‌ ఓడించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

మొబైల్ పరికరాల కోసం ఆండ్రాయిడ్ నాన్-యాపిల్ ప్లాట్‌ఫామ్‌గా మారిందని, దానికి బదులుగా మైక్రోసాఫ్ట్ చక్కని ఓఎస్ తీసుకొచ్చినట్లైతే సక్సెస్ అయ్యే వారమని తెలిపారు.

ఈ ఎదురుదెబ్బ ఉన్నప్పటికీ, నాదెళ్ల గేమింగ్ పరిశ్రమపై తన ఉత్సాహాన్ని ప్రదర్శించారు.మైక్రోసాఫ్ట్‌కు గేమింగ్ ముఖ్యమైన వాటిలో ఒకటి.

ప్రపంచంలోని అతిపెద్ద గేమ్ పబ్లిషర్‌లలో ఒకటైన యాక్టివిజన్ బ్లిజార్డ్‌ను కొనుగోలు చేయడానికి ఇటీవలి ఒప్పందంతో దానిని రెట్టింపు చేస్తున్నట్లు అతను చెప్పారు.

ఈ ఒప్పందం మైక్రోసాఫ్ట్ ఆదాయాన్ని, గేమింగ్ మార్కెట్‌లో స్థానాన్ని పెంచుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.