తీవ్ర తుపానుగా మారిన మిచాంగ్..!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మిచాంగ్ తీవ్ర తుపానుగా మారింది.రేపు నెల్లూరు - మచిలీపట్నం మధ్య బాపట్లకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

పాండిచ్చేరికి ఈశాన్యంగా 210 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 110 కిలోమీటర్లు, నెల్లూరుకు ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

అలాగే బాపట్లకు దక్షిణ ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.

తీరం దాటే సమయంలో గంటలకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

ఈ నేపథ్యంలో తీరప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.అలాగే మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకూడదని తెలిపింది.

అలాగే తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తొలి సినిమాలోనే పౌరాణిక పాత్రలో మోక్షజ్ఞ.. ఈ వార్త నిజమైతే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్!