సూపర్ మేన్ లాగా పెరిగిపోతున్న 14 ఏళ్ల బాలుడు… తన కాలికి చెప్పులే దొరకడంలేదట!

అవును, మీరు ఇక్కడ చదివింది నిజమే.నిండా 14 ఏళ్లు నిండని ఓ పిల్లాడు సూపర్ మేన్( Super Man ) లాగా పెరిగిపోతూ అందరికీ షాక్ ఇస్తున్నాడు.

ఇక ఆ పిల్లాడి చెప్పుల సైజు( Shoe Size ) ఎంతుంటుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

ఆ పిల్లాడి పాదం సైజు మాత్రం ఏకంగా 23 ఉంది.ఏంటి అవాక్కవుతున్నారా? మరెందుకాలస్యం.

విషయంలోకి వెళ్ళిపోదాం పదండి.అమెరికాలోని మిచిగాన్‌లోని ఓర్టన్‌విల్లేకు చెందిన 14 ఏళ్ల 'ఎరిక్ కిల్‌బర్న్‌ జూనియర్‌'( Eric Kilburn Jr ) అనే పిల్లాడు అంతకంతకూ పెరిగిపోతూ అందరికీ షాక్ ఇస్తున్నాడు.

అతడి పాదాలకు సరిపోయే బూట్లు దొరక్కపోవడంతో 22 సైజున్న బూట్లు ధరించడంతో అతడి రెండు కాళ్ళు బొబ్బలెక్కాయంటే నమ్మండి.

"""/"/ ఇక అసాధారణంగా కనిపించే ఆ పిల్లాడితో ఇతర పిల్లలు ఆడడానికి సంకోచిస్తున్నారని వాపోతున్నాడు.

తన 36 ఏళ్ల వయస్సు గల తల్లి రెబకా కొడుకు ఎరిక్‌కు బూట్లు కొనడానికి తిరగని షాపు లేనే లేదు.

ఇక అతగాడి ఎత్తు తెలిస్తే మీరు పెయింట్ అయిపోతారు.6 అడుగుల 10 అంగుళాలు.

చివరికి బూట్లు తయారు చేసే కంపెనీలు కూడా ఈ మహాబలుడి పాదాలకు చెప్పులు తయారుచేయలేక చేతులెత్తేశారట.

వీరి పరిస్థితిపై స్థానిక మీడియా ఓ వార్త ప్రసారం చేయగా అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

"""/"/ ఇకపోతే ఎట్టకేలకు 'ప్యూమా అండ్‌ అండర్ ఆర్మర్'( Puma And Under Armour ) అనే కంపెనీ అతగాడికోసం సైజు 23 షూలను ప్రత్యేకంగా తయారు చేసేందుకు ముందుకు రావడం విశేషం.

ఫుట్‌వేర్ డెవలప్‌మెంట్ సీనియర్ డైరెక్టర్ రాబ్ క్రాప్( Senior Director Of Footwear Development Robb Cropp ) ఈ విషయంపైన మాట్లాడుతూ.

"ఇలాంటి షూ పరిమాణం ఉన్న వ్యక్తులు ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదుగా వుంటారనే చెప్పాలి.

అయితే పిల్లల అభివృద్ధికి ఆటలు చాలా అవసరం.అందుకే మేము ఎరిక్‌కు షూ తయారు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాం.

ఎరిక్‌ ఇతర పిల్లల మాదిరిగా ఆదుకోవాలి.అతని కలలను సాకారం చేసుకోవాలి" అని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే ఎరిక్‌ ఏడో తరగతి చదివేటప్పుడు షూ సైజు 11.ఒక దశలో ఎరిక్‌కు సరిపడా షూ దొరకకపోవడంతో రెండేళ్లపాటు క్రోక్స్ ధరించవలసి వచ్చిందట.

పసిఫిక్ కింద దాగిన అద్భుతమైన మెగాస్ట్రక్చర్.. దాన్ని చూసి శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం..