US Presidential Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలు : బైడెన్‌ తప్పుకుంటే.. ప్రత్యామ్నాయం ఎవరు, వెలుగులోకి ఆసక్తికర సర్వే

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ( US Presidential Elections ) ఊపందుకుంది.రిపబ్లికన్ పార్టీలో అభ్యర్ధిత్వ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదురులేకుండా దూసుకెళ్తున్నారు.

వరుసపెట్టి ప్రైమరీల్లో విజయం సాధిస్తూ వస్తున్నారు.డెమొక్రాటిక్ పార్టీ విషయానికి వస్తే అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) ఒక్కరే మంచి ఊపులో వున్నారు.

దీంతో 2024 ఎన్నికల్లో తలపడేది బైడెన్, ట్రంప్‌లేనని అమెరికన్లు ఫిక్స్ అయిపోయారు.ఇలాంటి పరిస్ధితుల్లో అమెరికాలో ఓ ఆసక్తికర సర్వే వెలుగులోకి వచ్చింది.

అనుకోని పరిస్ధితుల్లో బైడెన్ పోటీ చేయలేకపోతే.ఆయనకు బదులు ఎవరిని రంగంలోకి దింపుతారన్న దానికి డెమొక్రాట్లు( Democrats ) విచిత్ర సమాధానమిచ్చారు.

రాస్ముస్సేన్ రిపోర్ట్స్‌ ఇటీవల నిర్వహించిన పోల్‌లో 48 శాతం మంది బైడెన్ స్థానంలో పార్టీ మరో అభ్యర్ధిని ఎంపిక చేయడానికి అనుకూలంగా ఓటేసినట్లు తెలిపారు.

"""/"/ 38 శాతం మంది మాత్రం నిరాకరించగా.33 శాతం మంది అభ్యర్ధిని మార్చే అవకాశం వుందని అభిప్రాయపడ్డారు.

డెమొక్రాటిక్ పార్టీలో బైడెన్‌కు ప్రత్యామ్నాయంగా కమలా హారిస్( Kamala Harris ), మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్, మిచిగన్ గవర్నర్ గ్రెచెన్ విట్మర్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా( Michelle Obama ) పేర్లను సర్వేలో ప్రతిపాదించారు.

సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధికంగా 20 శాతం మంది మిచెల్ వైపు మొగ్గుచూపారు.ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు 15 శాతం, హిల్లరీ క్లింటన్‌కు 12 శాతం మంది మద్ధతు పలికారు.

వయసును దృష్టిలో పెట్టుకుని బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.మిచెల్‌ను బరిలో దింపేందుకు డెమొక్రాట్లు యోచించడం వెనుక కారణాలు లేకపోలేదు.

జో బైడెన్ (36 శాతం ) కంటే .ఆమెకు ఎక్కువ మంది ప్రజామోదం (48 శాతం) వుందని సర్వేలు చెబుతున్నాయి.

"""/"/ మిచెల్ గనుక బరిలోకి దిగితే వార్ వన్ సైడేనని నివేదిక తెలిపింది.

పోల్ సర్వేల్లో జో బైడెన్ నిరుత్సాహకరమైన ప్రదర్శన తీవ్రతను బరాక్ ఒబామా గుర్తించారని రాడార్ ఆన్‌లైన్ నివేదించింది.

సమయం గడిచేకొద్దీ బైడెన్ మరింత పెద్దవారవుతున్నారని.గెలవలేని స్ధితికి చేరుకుంటారని ఒబామా భావిస్తున్నారు.

అయితే బైడెన్‌కు ఒబామా ఆమోదం తెలిపినప్పటికీ.బయట మాత్రం తిరస్కరించారని రాడార్ ఆన్‌లైన్ అంటోంది.

మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

ఇది కదా ట్రెండ్ అంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వంటమనిషి సీవీ