వైకల్యం ఉన్నా అందాల పోటీలో విజేతగా నిలిచిన మహిళ.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

వైకల్యం ఉన్నవాళ్లకు అందాల పోటీలో విజేతగా నిలవడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.

అయితే ఒక యువతి మాత్రం అందాల పోటీలో విజేతగా నిలవడం ద్వారా వార్తల్లో నిలిచారు.

ఆ యువతి పేరు మియా లే రూ ( Mia Lay Ru )కాగా ఆమె సక్సెస్ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఆమె మాట్లాడుతూ సహజంగా ఎడంగా ఉంచే దివ్యాంగులకు ఈ గెలుపు ఎంత ముఖ్యమైన గెలుపో నాకు తెలుసని ఆమె అన్నారు.

అనూహ్యమైన కలలు కనడంతో పాటు ఆ కలలను సాధించవచ్చని నేను ప్రూవ్ చేశానని మియా లే రూ పేర్కొన్నారు.

దివ్యాంగుల విషయంలో భూమిపై ఉన్న ఆంక్షలను నేను బద్దలుగొట్టానని ఆమె చెప్పుకొచ్చారు.మియా లే రూ వయస్సు 28 సంవత్సరాలు కాగా ఈ మహిళ బధిర మహిళ కావడం గమనార్హం.

దక్షిణాఫ్రికాలో( South Africa ) అందాల పోటీలు గత 66 సంవత్సరాలుగా జరుగుతుండగా ఈ పోటీల్లో విజేతగా నిలిచిన తొలి బధిర మహిళ మియా లే రూ కావడం కొసమెరుపు.

"""/" / అందాల పోటీలో విజేతగా నిలవడంతో ఆమెకు 50 లక్షల రూపాయల నగదు, లగ్జరీ బెంజి కారుతో పాటు ఖరీదైన ఫ్లాట్, ఇతర బహుమతులు దక్కాయి.

దక్షిణాఫ్రికా పాలనా రాజధాని పిట్రోరియా ( Pitroria )కాగా అక్కడ జరిగిన ఫైనల్స్ లో ఈ యువతి అరుదైన జరిగిన ఫైనల్స్ లో మియా లే రూ ఈ ఘనత సాధించడం గమనార్హం.

ఫ్రెంచ్ మూలాలున్న కుటుంబంలో మియా లే రూ జన్మించడం గమనార్హం. """/" / మియా పుట్టిన ఏడాది తర్వాత ఆమె చెవుడుతో బాధ పడుతోందని తల్లీదండ్రులు గుర్తించడం జరిగింది.

కాక్లియర్ ఇంప్లాంట్స్ వేసి స్పీచ్ థెరపీ( Speech Therapy With Cochlear Implants ) ఇచ్చిన తర్వాత ఆమె మాట్లాడింది.

పెదవుల కదలికను బట్టి ఎదుటివారి మాటలను నేను అర్థం చేసుకుంటానని మియా లే రూ పేర్కొన్నారు.

ఆమె సక్సెస్ స్టోరీని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.

పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా హీరో ఎవరో తెలుసా..?