భర్తతో రిలేషన్ కు ఎండ్ కార్డ్ వేసిన మియా ఖలీఫా.. కారణమేంటంటే?
TeluguStop.com
ఈ మధ్య కాలంలో సినిమా సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
కొన్ని రోజుల క్రితం అమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా మియా ఖలీఫా భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించి అభిమానులకు భారీ షాక్ ఇవ్వడం గమనార్హం.
రెండు సంవత్సరాల రిలేషన్ షిప్ కు మియా ఖలీఫా శుభం కార్డు వేశారు.
శృంగార తారగా మియా ఖలీఫాకు ఉండే పాపులారిటీ అంతాఇంతా కాదు.తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా భర్త రాబర్ట్ శాండ్ బర్గ్ నుంచి విడిపోతున్నానని మియా ఖలీఫా ప్రకటించడం గమనార్హం.
భర్తతో విడిపోతున్నందుకు తనకు బాధగా లేదని మియా ఖలీఫా తెలిపారు.భర్తతో తాను విడిపోయినా మంచి స్నేహితులలా ఉంటామని ఆమె వెల్లడించారు.
విడిపోవడానికి ఇదే రీజన్ అని చెప్పలేనని ఒకరినొకరు గౌరవించుకుంటూ రిలేషన్ ను ఎండ్ చేస్తున్నామని మియా ఖలీఫా పేర్కొన్నారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/07/mia-khalifa-announces-separation-orce-from-husband-robert-sandbergs!--jpg "/
మియా ఖలీఫా పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండగా ఈ పోస్ట్ గురించి పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన మియా ఖలీఫాకు సోషల్ మీడియాలో సైతం భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఏడాది నుంచి తామిద్దరం కలిసి ఉండాలని ప్రయత్నాలు చేసినా వీలు కాలేదని మియా ఖలీఫా చెప్పుకొచ్చారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2021/07/mia-khalifa-announces-separation-orce-from-the-husband-robert-sandberg!--jpg "/
ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడానికి కౌన్సిలింగ్ కూడా తీసుకున్నామని ఆమె అన్నారు.
అయితే ఇద్దరి మనసులు కలవవని ఫిక్స్ అయ్యామని వేర్వేరుగా కొత్త లైఫ్ ను ప్రారంభిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు.
భర్తతో విడిపోయిన మియా ఖలీఫా మళ్లీ పెళ్లి చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.
సెలబ్రిటీలు పెళ్లైన కొన్ని సంవత్సరాలకే తమ రిలేషన్ షిప్స్ ను బ్రేక్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.
ప్రభాస్ ప్లాప్ సినిమాలకు కూడా ఆ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయా..?