ఇకపై భారత్ రావాలంటే ఈ కొత్త వీసా విధానం తప్పనిసరి...!!
TeluguStop.com
భారత ప్రభుత్వం వీసా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని భావిస్తోందా, భారత్ లోకి అక్రమంగా ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టనుందా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు.
ఇకపై భారత్ లోకి రావాలంటే తప్పకుండా నూతన వీసా విధానం ద్వారా మాత్రమే ప్రవేశాలకు అనుమతులు ఉంటాయని తేల్చి చెప్తోంది కేంద్రం.
అందుకు తగ్గట్టుగా నూతన వీసా మార్గాదర్సాకాలపై తీవ్ర కసరత్తులు కూడా చేస్తోందట.ఇదంతా ఎందుకంటే అమెరికా దళాలు ఆఫ్ఘానిస్తాన్ ను విడిచి వెళ్ళిన తరువాత తాలిబన్లు పూర్తిగా ఆఫ్ఘానిస్తాన్ను స్వాధీనం చేసుకున్న విషయం విధితమే.
ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం కొత్తగా ఎలక్ట్రానిక్ వీసా విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది.
ఈ విధానం ద్వారా భారత్ లోకి ప్రవేశం కోసం వచ్చే దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయవచ్చునని ప్రకటించింది.
ఈ వీసా ఆఫ్ఘాన్ లో చిక్కుకున్న హిందువులు, సిక్కులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది కేంద్ర హోమంత్రిత్వ శాఖ.
ఈ వీసా విధానాన్ని “ E –Emergency X-Misc VISA అంటారు.భారత దేశంలో ఆశ్రయం పొందాలనుకునే ఆఫ్హాన్ వాసులకు ఈ వేగవంతమైన వీసా విధానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.
ఇప్పటికే ఎంతో మంది ఆఫ్హాన్ వాసులు ఆఫ్హాన్ తీరాల గుండా టర్కీ వంటి దేశాలకు వలసలు వెళ్తుండగా ఆయా సరిహద్దు దళాలు నిర్దాక్షిణ్యంగా వారిపై తుపాకులతో దాడులు చేస్తున్నాయి.
ఇదిలాఉంటే ఆఫ్ఘాన్ లో పనిచేస్తున్న 120 మంది భారత ఎంబసీ సిబ్బందిని మరియు అధికారులను సురక్షితంగా భారత్ కు తరలించే ఏర్పాట్లు చేస్తోంది భారత ప్రభుత్వం.
ఇప్పుడు చేయబోయే సినిమాతో రామ్ పోతినేని సూపర్ హిట్ కొడుతాడా..?