ఈ లాయర్ చాలా రిచ్.. సొంత విమానమే కాదు సొంత బోట్ కూడా ఉండేది..?

సాధారణంగా సుప్రీంకోర్టు హైకోర్టు లాయర్లు ఎంత క్లయింట్ నుంచి తీసుకునే ఫీజు అనేది లక్షల్లో ఉంటుంది.

గంటకే వాళ్లు రూ.10 లక్షల నుంచి రూ.

50 లక్షల దాకా క్లయింట్ నుంచి డబ్బులు వసూలు చేస్తుంటారు.ముఖ్యమంత్రి లాంటి పెద్ద క్లయింట్లు వారికి కోట్లలో డబ్బులు ఇవ్వడానికి కూడా వెనకాడరు.

రోజుకు కోట్లలో మనీ తీసుకునే వారు కూడా ఉన్నారు.ఉదాహరణకు చంద్రబాబు( Chandrababu ) కొన్ని నెలల క్రితం హైర్‌ చేసుకున్న సిద్ధార్థ్ లూథ్రా( Sidharth Luthra ) అనే అడ్వొకేట్ రాజకీయ కోటి రూపాయలు వసూలు చేశాడు.

అతని కోసం స్పెషల్‌గా ఢిల్లీ నుంచి విమానం వేయించారు.ఇలా హై ప్రొఫైల్ కేసు దొరికితే చాలు లాయర్లు చార్టెడ్ ఫ్లైట్‌ల ప్రయాణాలతో రాజభోగాలు అనుభవిస్తారు.

ఈ రోజుల్లోనే కాదు పాత కాలంలో అంటే 60-70 ఏళ్ల క్రితం కూడా ఎక్కువ ఫీజ్‌ పొందిన, ఎక్కువ సౌకర్యాలను అనుభవించిన లాయర్లు ఉన్నారు.

వీరి లాగానే ఒక న్యాయవాది కోటీశ్వరులకు ఏమాత్రం తీసుపోనీ విధంగా లైఫ్ స్టైల్ సాగించాడు.

అయితే ఆయన క్లయింట్ల వద్ద అప్పనంగా ఫీజు వసూలు చేయలేదు.ఆ లాయరే అక్బర్ ఇమామ్.

( Lawyer Akbar Imam ) ఆయన కేవలం పేదవాళ్ల కోసమే వాదించాడు.

వారికి న్యాయం జరగాలని ఉద్దేశంతో తన డబ్బులు ఖర్చు చేశాడు.ధనికుడిగా జీవితం సాగించాడు కానీ అవి తన వారసత్వంగా వచ్చిన డబ్బులతోనే ఆ భోగాలను ఆస్వాదించాడు.

"""/" / ఈ న్యాయవాది ఓ టూ సీటర్ (ఎల్5 మోడల్) ప్లేన్‌ కూడా కొనుగోలు చేశాడు.

క్లయింట్స్ కోసం వాదించేందుకు ఇందులోనే పట్నా నుంచి ఢిల్లీ, రాంచి, లక్నో వంటి ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవాడు.

ఢిల్లీలో( Delhi ) వాదించడానికి బయలు దేరాడంటే.లక్నో విమానాశ్రయంలో ఒక సారి ఆగేవాడు అక్కడ ఫ్యూయల్ రీఫిల్ చేసుకునేవారు.

ఆపై ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్టులో ఆ చిన్న విమానాన్ని ల్యాండ్ చేసేవారు.సమీపంలో ఉన్న సుప్రీంకోర్టుకు( Supreme Court ) వెళ్లి కోర్టుకు హాజరయ్యి క్లయింట్స్ కోసం వాదనలు చేసి వినిపించి తిరిగి విమానంలో పట్నాకు చేరుకునేవాడు.

"""/" / అక్బర్ తన 2-సీటర్ విమానంలో తనతో పాటు తన సీనియర్ సెక్రటరీ, లేదంటే జూనియర్ సెక్రటరీని ఎక్కించుకునేవాడు.

పేద వాళ్ళ కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని వాదనలు చేసేవాడు.ఆయన క్లయింట్స్ కనీసం రిక్షా చార్జీలు కూడా ఇవ్వలేని పేద స్థితిలో ఉండేవారు.

వాళ్లే చాలాసార్లు ఎయిర్‌పోర్టు నుంచి సైకిల్ మీద అక్బర్ ను ఎక్కించుకొని సుప్రీంకోర్టుకు తీసుకు వెళ్లేవారు.

విమానంలో ఫ్యూయల్ పెంచుకోవడానికి ఈ లాయర్ తన సొంత డబ్బుని ఉపయోగించేవాడు.అలా మిగతా లాయర్ లందరికీ భిన్నంగా ఈయన నిలిచారు తన సొంత డబ్బులతో లైఫ్ హ్యాపీగానే గడిపారు గానీ బాబుల కోసం అన్యాయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

విమానంతో పాటు ఈ లాయర్‌కు గంగా నది ఒడ్డున సొంత బోట్ కూడా ఉండేదట.

అందులో కూడా తరచూ వారణాసి, అలహాబాద్ వంటి వివిధ ప్రాంతాలకు వెళ్లేవాడు.

టాలీవుడ్ లో ఒక్కరే బాస్… చిరంజీవిపై దిల్ రాజు కామెంట్స్ వైరల్!