Beetroot Crop : బీట్ రూట్ పంటను ఆశించే పసుపు మచ్చ తెగుళ్లను అరికట్టే పద్ధతులు..!
TeluguStop.com
బీట్ రూట్( Beetroot ) లో పోషకాలు చాలా ఎక్కువ.ముఖ్యంగా రక్తహీనత తో బాధపడుతున్న వారికి బీట్ రూట్ ఒక మంచి ఔషధం.
కాబట్టి ఈ పంటకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.సారవంతమైన, లోతైన ఇసుక నేలలు ఈ పంట సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి.
అధిక క్షార లక్షణాలు ఉండే చౌడు నేలల్లో కూడా ఈ పంట సాగు చేయవచ్చు.
బీట్రూట్ లో మేలు రకం విత్తనాల విషయానికి వస్తే.ఎర్లి వండర్, రెడ్ బాల్, డెట్రాయిట్ డార్క్ రెడ్ లాంటి రకాలు అధిక దిగుబడి( High Yield ) ఇస్తాయి.
ఒక ఎకరాకు నాలుగు కిలోల విత్తనాలు అవసరం. """/" /
ఆగస్టు నుంచి నవంబర్ వరకు బీట్రూట్ విత్తుకోవచ్చు.
మొక్కల మధ్య పది సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.
గింజలు మొలకెత్తిన తర్వాత ఒక్కొక్క సీడ్ బాల్ నుండి దాదాపుగా 5 లేదా 6 మొలకలు వస్తాయి.
ఒక బలమైన మొలక ఉంచి మిగిలినవి పీకేయాలి. """/" /
విత్తనం నాటిన వెంటనే ఒక నీటి తడి ఇవ్వాలి.
నీటిని డ్రిప్ విధానం( Drip Method ) ద్వారా అందిస్తే కలుపు సమస్య ఎక్కువగా ఉండదు.
ఇక బీట్రూట్ పంటకు చీడపీడల, తెగుళ్ల బెడద చాలా ఎక్కువ.ముఖ్యంగా పసుపు పచ్చ తెగుళ్లు ఆశిస్తే జీవన నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.
కాబట్టి బీట్రూట్ విత్తనాలను రెండు గ్రాముల కాప్టాన్ తో విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలి.
ఈ తెగుళ్లు పంట పొలంలో గుర్తించిన తర్వాత రెండు గ్రాముల డైథేనెజ్డ్-78 ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఈ తెగుళ్ల కోసం పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ తొలిదశలోనే అరికడితే పంట సంరక్షించబడి అధిక దిగుబడి పొందవచ్చు.
పంట విత్తిన మూడు నెలలకు చేతికి వస్తుంది.
ఫుట్‌పాత్‌పై మహీంద్రా థార్‌తో దూసుకెళ్లిన బాలుడు.. వీడియో చూస్తే..