మిరపలో గడ్డి జాతికి చెందిన కలుపును నివారించే పద్ధతులు..!
TeluguStop.com
మిరప పంట( Chilli Crop ) ప్రధానమైన వాణిజ్య పంటగా ప్రసిద్ధి చెందింది.
మిరప పంటకు నీటి తడులు, ఎరువులు అధిక మోతాదులో అవసరం.కాబట్టి మిరప పంటలో అధికంగా కలుపు వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ కలుపు వల్ల మిరప పంటకు నష్టం కలుగకుండా ఉండేందుకు రైతులు వివిధ క నివారణ యాజమాన్య పద్ధతులను సమగ్రంగా చేపట్టాలి.
ముందుగా వేసవికాలంలో నేలను ఎనిమిది అంగుళాల లోతు వరకు టాక్టర్ నాగలితో దుక్కి చేసుకోవాలి.
తొలకరి వర్షాల సమయంలో రెండు లేదా మూడుసార్లు గొర్రు, గుంటకలతో నేలను దున్నుకుంటే మిరప పైరులో చాలా వరకు కలుపు రాకుండా నివారించబడుతుంది.
"""/" /
మిరప పంట విత్తడానికి ముందే ఒక ఎకరాకు పెండిమిథాలిన్( Pendimethalin ) 30శాతం 1లీ ను 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారి చేయాలి.
తర్వాత మిరప నారును పొలంలో నాటుకోవాలి.మొక్కల మధ్య, మొక్కల వరసల మధ్య దూరం ఉండేటట్లు నాటుకుంటే గొర్రు లేదా గుంటకల్ తో అంతర సేద్యం చేయడానికి అవకాశం ఉంటుంది.
మిరప నాటిన 25 న రోజులలోపు ఒకసారి అంతర సేద్యం చేపట్టాలి. """/" /
ఇక మిరప పైరు పెరిగే దశలో గడ్డి జాతికి చెందిన కలుపు నివారణ కోసం ఒక ఎకరం పొలంలో 250 మిల్లీమీటర్ల ఫెనాక్సాప్రావ్ ( Fenoxaprav 09% ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
ఈ రసాయనం పిచికారి చేసిన తర్వాత మిరప పైరు నాలుగు లేదా ఐదు రోజుల వరకు కొంచెం పసుపు రంగులోకి మారి ఎదుగుదల తగ్గుతుంది.
పది రోజుల లోపు మిరప పైరు సాధారణ స్థితిలోకి వస్తుంది.అయితే వర్షాలు కురుస్తూ, అంతర సేద్యానికి అవకాశం లేనప్పుడు మాత్రమే ఈ రసాయన మందులను పిచికారి చేయాలి.
మిరపపైరుకు నీటి తడి అందించిన తర్వాత బాగా తడిగా ఉన్నప్పుడు ఆక్సీఫ్లూరోఫెన్( Oxyfluorophen ) 23.
59 ఎకరానికి 200మి.లీ ను పది కిలోల ఇసుకతో కలుపుకొని మిరప మొక్కలపై పడకుండా సాళ్ల మధ్య ఉండే నేల మీద పడేటట్లు వేస్తే కలుపు నివారించబడుతుంది.
చిరంజీవితో సినిమా చేయాలంటే ఈ ఆస్థాన రచయితల సలహాలు కూడా తీసుకోవాల్సిందే…