బెండ సాగులో మచ్చల బోల్ వార్మ్ పురుగులను అరికట్టే పద్ధతులు..!
TeluguStop.com
కూరగాయల పంటలలో బెండ కూడా ఒకటి.బెండ పంటకు ( Ladies Finger Cultivation )మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
అయితే బెండను సాగు చేసే రైతులు( Farmers ) ఆ పంటను ఆశించే చీడపీడలు తెగుళ్లను సకాలంలో గుర్తించి, తొలి దశలోనే అరికట్టే ప్రయత్నం చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.
బెండ పంటను సాగు చేసే రైతులు పంటను ఆశించే చీడపీడలు,( Pests ) తెగుళ్లపై ముందుగా అవగాహన కల్పించుకోవాలి.
అప్పుడే పంటను సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది.బెండ పంటకు తీవ్ర నష్టం కలిగించే చీడపీడలలో మచ్చల బోల్ వార్మ్ పురుగులు కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ పురుగులు రెండు సెంటీమీటర్ల పొడవు ఉండి పాలిపోయిన పచ్చని రంగులో ఉంటాయి.
మొక్క లేత చిగుళ్లపై, పూమొగ్గలపై నీలిరంగు గుడ్లను పెడతాయి. """/" /
ఈ పురుగుల లార్వా బెండకాయలపై దాడి చేస్తుంది.
చిగుర్లు పువ్వులను కూడా ఆహారంగా తీసుకుంటుంది.ఈ పురుగులు పంటను ఆశిస్తే మొగ్గలు పుష్పించకుండానే రాలిపోతాయి.
మొక్క ప్రధాన కాండం దెబ్బతిని మొక్క కుప్ప కూలిపోతుంది.ఈ పురుగులు పంటను ఆశిస్తే తొలి దశలో అరికట్టడం కాస్త ఆలస్యమైన కూడా సగానికి పైగా దిగుబడి తగ్గే అవకాశం ఉంది.
ఈ పురుగులు పంటను ఆశించకుండా ఉండాలంటే.తెగులు నిరోధక మొక్కలను ఎంపిక చేసుకుని మొక్కల మధ్య సరిపడా దూరం ఉండేటట్లు నాటుకోవాలి.
ఎరువులను సరైన మోతాదులో వేసుకోవాలి.చీడపీడలను ఆకర్షించే ఎరా పంటలను వేసుకోవాలి.
పంట మార్పిడి కచ్చితంగా చేయాలి. """/" /
ఈ పురుగుల గుడ్లు, చిన్న లార్వాలను సేంద్రీయ పద్ధతిలో( Organic Method ) అరికట్టాలి.
బ్రేకొనిడయి, స్కెలియనిడయి లాంటి పరానా జీవి కందిరీగల ద్వారా వీటిని నియంత్రించవచ్చు.హేమిప్తేరా, న్యూరోప్తేరా లాంటి కీటకాలను ఉపయోగించి ఈ పురుగులను పూర్తిగా అరికట్టవచ్చు.
రసాయన పద్ధతిలో ఈ పురుగులను అరికట్టాలంటే.గుడ్ల దశలో ఉన్నప్పుడే వీటిని అరికట్టే ప్రయత్నం చేయడం మంచిది.
ఏమామెక్టిన్ బెంజోయెట్, మేథోమేల్ లాంటి మందులు ఉపయోగించి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేసి ఈ పురుగులను అరికడితే మంచి దిగుబడులు సాధించవచ్చు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా వెంకటేష్ కి భారీ సక్సెస్ ను ఇస్తుందా..?