చిక్కుడు పంటను ఆశించే సాలీడు పురుగులను అరికట్టే పద్ధతులు..!

చిక్కుడుపంటను ( Soybean )ఆశించే సాలీడు పురుగులు( Spider Mites ) టెట్రానీచస్ జాతికి చెందినవి.

ఈ పురుగులు దాదాపుగా 0.6 మిల్లీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి.

ఇవి లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి.కోన్ని పురుగులు ఎరుపు రంగులో కూడా ఉంటాయి.

వసంతకాలంలో ఆడ పురుగులు గుండ్రని గుడ్లను ఆకు కింద పెడతాయి.అక్కడే సాలిగూడు ఏర్పాటు చేసుకుంటాయి.

ఈ పురుగులకు చాలా రకాల కలుపు మొక్కలు అతిధి మొక్కలుగా ఉంటాయి.కాబట్టి ఈ పురుగులను తొలి దశలోనే అరికట్టకపోతే తీవ్రంగా నష్టాన్ని మిగిలుస్తాయి.

"""/" / ఈ పురుగులు ఆశించిన మొక్క యొక్క ఆకులపై తెలుపు నుండి పసుపు రంగు మచ్చలు( Yellow Spots ) కనిపిస్తాయి.

ఇలా మారిన ఆకుల కింద సాలీడు గుడ్లను చూడవచ్చు.ఆకులు ఈనెల మధ్య కత్తిరించబడి తెరుచుకొని చివరికి రాలిపోతాయి.

పంట ఎదుగుదల ఆగిపోతుంది.ఈ పురుగులు పంటను ఆశించకుండా ఉండాలంటే తెగులు నిరోధక మేలు రకం విత్తనాలను ఎంచుకొని సాగు చేయాలి.

తెగుల లక్షణాల కొరకు పంట పొలాన్ని క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలి.అనుమానం వస్తే ఆకు కింద ఒక తెల్ల కాగితం ఉంచి ఆకులు కదిపి పరీక్షించాలి.

ఈ మొక్క ఆశించిన మొక్కలను వెంటనే పంట నుండి వేరు చేయాలి.ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.

"""/" / ఇక సేంద్రీయ పద్ధతిలో ఈ సాలీడు పురుగులను అరికట్టడం కోసం ఆ పురుగుల జాతిని బట్టి జీవ నియంత్రణ ఫంగస్ ను లేదంటే బాసిల్లస్ తురింగియెన్సిస్( Bacillus Thuringiensis ) వాడాలి.

వెల్లుల్లి టీ, దురద గొండి ముద్ద, పురుగుమందు సబ్బు మిశ్రమాలను వాటి వీటిని అదుపులో ఉంచవచ్చు.

రసాయన పద్ధతిలో ఈ పురుగులను అరికట్టడం కోసం వెట్టబుల్ సల్ఫర్ 3గ్రా.ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.

లేదంటే స్పిరో మెసిఫిన్ 1 మి.లీ.

ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.