బంగాళా దుంప పంటలో సెప్టోరియా ఆకు మచ్చ తెగుళ్లను నివారించే పద్ధతులు..!
TeluguStop.com
బంగాళాదుంప పంట( Potato Crop )కు మార్కెట్లో ఎప్పుడు మంచి గిరాకీ ఉంటుంది.
మిగతా పంటల ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం కానీ బంగాళదుంప పంట ధర మాత్రం దాదాపుగా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.
కాబట్టి బంగాళ దుంప సాగుపై అవగాహన కల్పించుకుని సాగు చేస్తే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడి పొందవచ్చు.
"""/" /
ఈ బంగాళదుంప పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే.
సెప్టోరియా ఆకు( Septoria ) మచ్చ తెగులు కీలక పాత్ర పోషిస్తాయి.సెప్టోరియా లైకోపెర్సీసీ అనే ఫంగస్ వల్ల అకుమచ్చ తెగుళ్లు పంటకు వ్యాపిస్తాయి.
ఈ ఫంగస్ కేవలం టమాటా, బంగాళదుంప పంటలను మాత్రమే ఆశిస్తుంది.వాతావరణం లో ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉంటే ఈ ఫంగస్ వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది.
ఈ ఫంగస్ నీటి సరఫరా, వర్షం, పనిముట్ల ద్వారా మొక్కలకు సోకుతుంది.ఈ ఆకు మచ్చ తెగుళ్లు లేత బంగాళదుంప మొక్కలను ఆశిస్తాయి.
మొక్కల ఆకులపై బూడిద రంగు మచ్చలు చారాల రూపంలో ఆకుల కింది భాగంలో కనిపిస్తే ఆ మొక్కకు ఈ తెగుళ్లు సోగినట్టే.
తెగుళ్లు ముదిరితే ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోయి రాలిపోతాయి. """/" /
పొలంలో తెగులు సోకిన మొక్కలు కనిపిస్తే వెంటనే ఆ మొక్కను పీకేసి కాల్చి నాశనం చేయాలి.
మొక్కలకు సూర్యరశ్మి, గాలి బాగా తగిలేటట్లు కాస్త దూరంగా నాటుకోవాలి.పొలంలో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి.
పరిశుభ్రం చేసిన పరికరాలను మాత్రమే పొలంలో ఉపయోగించాలి.నీటి తడులు రాత్రి సమయంలో కాకుండా పగటి సమయంలో మాత్రమే పంటకు అందించాలి.
సేంద్రీయ పద్ధతి( Organic Method )లో కార్బన్ కలిగి ఉండే బోర్డ్ మిశ్రమం కార్బన్ హైడ్రాక్సైడ్, కాపర్ సల్ఫేట్ లాంటి శిలీంద్ర నాశినులను ఉపయోగించి ఈ తెగుళ్ళను నియంత్రించవచ్చు.
రసాయన పద్ధతిలో మాంకోజెబ్, క్లోరోతలోనిల్ లాంటి పిచికారి మందులను ఉపయోగించి తెగుళ్లను నివారించే పంటలు సంరక్షించుకోవచ్చు.
తెగుళ్లు ఆశించిన తొలి దశలోనే సంరక్షక చర్యలు చేపడితే ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
అమెరికాలో కేసుపై …అదానీ గ్రూప్ క్లారిటీ